క్రీడాభూమి

జైష వివాదంలో కోచ్‌దే తప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: రియో ఒలింపిక్స్ మహిళల మారథాన్‌లో పాల్గొనే సమయంలో భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఎఎఫ్‌ఐ) అధికారులు రేస్ జరుగుతున్న సమయంలో స్టాల్స్‌లో ఎక్కడా కనిపించలేదని, తనకు మంచినీళ్లు ఇచ్చే వారు కూడా కరవయ్యారని రన్నర్ ఒపి జైష చేసిన ఆరోపణలపై విచారణ పూర్తయన తర్వాత కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. జేషకు ఎదురైన దుస్థితికి ఆమె కోచ్ నికోలయ్ స్నెసరెవ్ ప్రధాన కారకుడని వ్యాఖ్యానించింది. మారథాన్ రేసులో 89వ స్థానంలో నిలిచిన ఆమె రేస్ పూర్తయిన వెంటనే నిస్త్రాణంగా ట్రాక్‌పైనే కళ్లు తిరిగిపడిపోయింది. ట్రాక్‌పైనే ప్రాణాలు పోతాయేమోనని భయపడినట్టు జైష సంచలన వ్యాఖ్యలు చేసింది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె చేసిన ఆరోపణలపై క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. జైష వ్యక్తిగత కోచ్ నికోలయ్ వ్యవహార శైలిని తప్పుపట్టింది. అతను బాధ్యతారాహిత్యంతో ప్రవర్తించాడని, ఫలితంగా జైషకు సమస్యలు తప్పలేదని పేర్కొంది.
ఇండియన్ సూపర్ లీగ్
ఫెలిస్బినో కీలక గోల్
ముంబయిపై గోవా విజయం
ముంబయి, అక్టోబర్ 21: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో శుక్రవారం గోవాను ఢీకొన్న ముంబయి 0-1 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. హోం గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో గెలవకపోయినా, కనీసం డ్రాతో బయటపడాలన్న ఉద్దేశంతో రక్షాణాత్మక విధానాన్ని అనుసరించిన ముంబయి మూల్యాన్ని చెల్లించుకుంది. ర్యాలిసన్ ఫెలిస్బినో 41వ నిమిషంలో కీలక గోల్ చేసి, గోవాకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆతర్వాత మరో గోల్ నమోదు కాకపోవడంతో, గోవా అదే తేడాతో గెలుపొందింది. ఈ జట్టుకు ఇది తొలి విజయంకాగా, ముంబయికి రెండో పరాజయం. అయితే, ఈ మ్యాచ్ ముగిసే సమయానికి ముంబయి మొత్తం ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.

కార్నర్’లపై శ్రద్ధ
నేడు కొరియాతో భారత్ హాకీ మ్యాచ్
కువాంటన్ (మలేసియా), అక్టోబర్ 21: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీలో జపాన్‌ను చిత్తుచేసిన భారత్ పెనాల్టీ కార్నర్‌లపై మరింత శ్రద్ధపెట్టి, దక్షిణ కొరియాతో శనివారం జరిగే పోరుకు సిద్ధమైంది. జపాన్‌పై రూపీందర్‌పాల్ సింగ్ డబుల్ హ్యాట్రిక్‌తో విజృంభించగా, భారత్ 10-2 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. మరోసారి అదే స్థాయిలో చెలరేగాలంటే, పెనాల్టీ కార్నర్లను సద్వినియోగం చేసుకోవాలని జట్టు మేనేజ్‌మెంట్ స్పష్టం చేస్తున్నది. ఈ విభాగంలో పటిష్టంగా ఉంటే, కొరియాపై విజయం సులభతరమవుతుందని నమ్ముతున్నది.
ఆ మ్యాచ్‌కి ప్రత్యేకత లేదు: ఇలావుంటే, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌కి ఎలాంటి ప్రధాన్యత లేదని భారత కెప్టెన్ శ్రీజేష్ స్పష్టం చేశాడు. టోర్నీలో అన్ని మ్యాచ్‌లూ కీలకమైనవేనని, దేనినీ తేలిగ్గా తీసుకునే ప్రసక్తి లేదని అన్నాడు. పాక్‌తో జరగబోయే పోరు కూడా అలాంటిదేనని వ్యాఖ్యానించాడు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో, భారత్, పాక్ జట్ల మ్యాచ్ ప్రాధాన్యతను సంతరించుకుంది.