క్రీడాభూమి

మున్రో మెరుపు ఇన్నింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్లాండ్, జనవరి 10: శ్రీలంకతో ఆదివారం జరిగిన రెండవ, చివరి టి-20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. 143 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. కొలిన్ మున్రో మెరుపు ఇన్నింగ్స్ కివీస్‌కు మరో 60 బంతులు మిగిలి ఉండగానే సునాయాస విజయాన్ని అందించింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ 49 బంతులు ఎదుర్కొని, 7 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 81 పరుగులు చేశాడు. తిలకరత్నే దిల్షాన్ 26 బంతుల్లో 28 పరుగులు సాధించాడు. వీరిద్దరిని మినహాయిస్తే లంక ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కివీస్ తరఫున గ్రాంట్ ఇలియట్ 22 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆడం మిల్నే, మిచెల్ సాంట్నర్ చెరి రెండు వికెట్లు కూల్చారు.
శ్రీలంకను ఓడించి, రెండు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ సాధించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు కెప్టెన్ కేన్ విలియమ్‌సన్, మార్టిన్ గుప్టిల్ శుభారంభాన్నిచ్చారు. విలియమ్‌సన్ నుంచి చక్కటి మద్దతు లభించడంతో గుప్టిల్ స్కోరుబోర్డును వేగంగా ముందుకు దూకించాడు. అతను 25 బంతులు ఎదుర్కొని, 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగులు చేసి తిసర పెరెరా బౌలింగ్‌లో వికెట్‌కీపర్ దినేష్ చండీమల్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. అప్పటికి కివీస్ స్కోరు 89 పరుగులు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మున్రోకు కూడా విలియమ్‌సన్ అదే సహకారాన్ని అందించాడు. లంక బౌలర్లపై విరుచుకుపడిన మున్రో టి-20 చరిత్రలోనే రెండో అత్యంత వేగవంతమైన అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. అతను 14 బంతులు ఎదుర్కొని, ఒక ఫోర్, ఏడు సిక్సర్లతో 50 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. విలియమ్‌సన్ 21 బంతుల్లో అజేయంగా 32 పరుగులు సాధించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి, న్యూజిలాండ్‌కు తిరుగులేని విజయాన్ని అందించారు. వేగంగా అర్ధ శతకాన్ని బాదిన మున్రోకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 (దిల్షాన్ 28, ఏంజెలో మాథ్యూస్ 81 నాటౌట్, ఇలియట్ 4/22, సాంట్నర్ 2/24, మిల్నే 2/36).
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 147 (గుప్టిల్ 63, కేన్ విలియమ్‌సన్ 32 నాటౌట్, మున్రో 50 నాటౌట్).

బౌండరీల వీరుడు..
* మున్రో చేసిన 50 పరుగుల్లో 46 పరుగులు సిక్సర్లు (7), ఫోర్లు (1) రూపంలో లభించాయి. ఈ విధంగా ఒక బ్యాట్స్‌మన్ స్కోరులో ఎక్కువ శాతం పరుగులు బౌండరీల రూపంలో లభించడం ఇది ఐదోసారి. ఈ జాబితాలో రికార్డు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ పేరిట ఉంది. అతను 2011లో న్యూజిలాండ్‌పై 57 పరుగులు చేశాడు. వాటిలో 54 పరుగులు (ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు) బౌండరీల ద్వారా లభించినవే.
* ఒక టి-20 ఇన్నింగ్స్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లో అత్యధికంగా సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా మున్రో పేరిట నమోదైంది. అతను ఈ ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు కొట్టి, 2014లో ఐర్లాండ్‌పై నెదర్లాండ్స్ ఆటగాడు టామ్ కూపర్ ఆరు సిక్సర్లతో నెలకొల్పిన రికార్డును రెండో స్థానానికి నెట్టేశాడు.

వృథా పోరాటం
* టి-20 ఫార్మెట్‌లో ఎక్కువ పరుగులు చేసినప్పటికీ జట్టును ఆదుకోలేకపోయిన శ్రీలంక బ్యాట్స్‌మెన్ జాబితాలో ఏంజెలో మాథ్యూస్ రెండోవాడు. అతను ఈ మ్యాచ్‌లో 81 పరుగులు సాధించింది. అంతకు ముందు ఇంగ్లాండ్‌తో టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో మహేల జయవర్ధనే 89 పరుగులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఒకే టి-20 మ్యాచ్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్ 20 కంటే తక్కువ బంతుల్లోనే అర్ధ శతకాలను సాధించడం ఇదే మొదటిసారి. అంతకు ముందు, 2009-10 సీజన్‌లో భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన టి-20 మ్యాచ్‌లో కుమార సంగక్కర 21, గౌతం గంభీర్ 19 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేశారు.

* టి-20 చరిత్రలోనే 120 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే ఛేదించిన తొలి జట్టుగా న్యూజిలాండ్ రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించింది. ఇంతకు ముందు దక్షిణాఫ్రికా 11.3 ఓవర్లలో 130 పరుగులు చేసి పాకిస్తాన్‌పై గెలుపొందింది. వేగంగా లక్ష్యాన్ని ఛేదించిన ఆ రికార్డును కివీస్ అధిగమించింది.

మున్రో కేవలం 14 బంతుల్లోనే 50 పరుగులు చేసి, టి-20 ఫార్మెట్‌లో అత్యంత వేగవంతమైన రెండో అర్ధ శతకాన్ని సాధించాడు. న్యూజిలాండ్ తరఫున ఇదే రికార్డు. ఇదే ఇన్నింగ్స్‌లో మార్టిన్ గుప్టిల్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో కివీస్ తరఫున రికార్డు నెలకొల్పగా, మున్రో కొన్ని నిమిషాల వ్యవధిలోనే దానిని బద్దలు చేశాడు. కాగా, టి-20లో అత్యంత వేగంగా, 12 బంతుల్లోనే అర్ధ శతకం చేసిన రికార్డు యువరాజ్ సింగ్ పేరిట ఉంది.