క్రీడాభూమి

ప్రపంచ కప్ కబడ్డీ ఫైనల్‌కు భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, అక్టోబర్ 21: ప్రపంచ కప్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భాఠత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ శు క్రవారం జరిగిన సెమీ ఫైనల్‌లో థాయలాండ్‌ను చి త్తు చేసింది. భారత జట్టు 73 పాయంట్లు సాధిస్తే, థాయలాండ్ 20 పాయంట్లు చేయగలిగింది.
సెమీస్‌లో ఫేవరిట్ ముంద్రతో కోర్టులో అడుగుపె ట్టిన భారత్ తన స్థాయకి తగిన ఆటతో అభిమాను లను ఆకట్టుకుంది. దూకుడుగా ఆడుతూ పాయంట్ల వరద సృష్టించింది. మ్యాచ్ ప్రథమార్ధం ముగిసే సమ యానికి భారత్ 36-8 తేడాతో ఆధిక్యాన్ని సంపాదిం చింది. పర్‌దీప్ నర్వాల్, అజయ్ ఠాకూర్ అసాధారణ ప్రతిభ కనబరిచారు. చెలరేగిపోయన వారిని అడ్డుకో వడానికి థాయలాండ్ ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించలేదు.
ద్వితీయార్ధంలోనూ భారత్ ఆధిపత్యం కొనసా గింది. థాయలాండ్ ఆటగాళ్లను ప్రేక్షకులుగా మార్చే సిన భారత క్రీడాకారులు పాయంట్లు కొల్లగొట్టారు. ప్రత్యర్థుల నుంచి ఎలాంటి ప్రటిఘటన లేకపోవడం తో భారత్ ఏక పక్షంగా దాడులను కొనసాగించింది. పాయంట్లపై పాయంట్లు సంపాదిస్తూ థాయలాండ్ కు దిక్కుతోచని స్థితికి నెట్టేసింది. ప్రథమార్ధంలో గొ ప్పగా ఆడిన పర్‌దీప్ నర్వాల్ (14), అజయ్ ఠాకూర్ (11) ద్వితీయార్ధంలోనూ ప్రతిభ కనబరిచారు. వీరికితోడు నితిన్ తోమర్ (7) కూడా రాణించడంతో భారత్ విజయం న ల్లేరుపై నడకగా మారింది. చివరి క్షణాల్లో థాయ్‌లాండ్ పాయంట్ల వేటను కొనసాగిం చినా, అప్పటికే కాలాతీతమైంది.
కొరియాకు ఇరాన్ షాక్
ఈ టోర్నీలో వరుస విజయాలతో సెమీస్ వరకూ చేరిన దక్షిణ కొరియాకు ఇరాన్ షాకిచ్చింది. సెమీస్‌ను ఆ జట్టు 28-22 తేడాతో గెల్చుకొని ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రో కబడ్డీలో ఆడిన అనుభవం ఉన్న ఇరాన్ కెప్టెన్ మిరాజ్ షేక్ అత్యధికంగా ఏడు పాయింట్లు చేశాడు. అబోజర్ మిగానీ నాలుగు పాయింట్లతో రాణించాడు. కొరియా ఆటగాళ్లలో జంగ్ కున్ లీ నాలుగు, తయ్ బియోమ్ కిమ్ మూడు చొప్పున పాయింట్లు సంపాదించారు.
భారత్, ఇరాన్ జట్ల మధ్య ఫైనల్
శనివారం రాత్రి 8.00 గంటలకు మొదలవుతుంది.