క్రీడాభూమి

చేజారిన ‘ప్రసార’ హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బిసిసిఐ ప్రధాన బలమే ఐపిఎల్. మ్యాచ్‌ల ప్రసార హక్కుల నుంచి అండార్స్‌మెంట్ల వరకూ ఐపిఎల్‌పై కోట్లాది రూపాయలు కురుస్తాయి. ప్రస్తుతం ఐపిఎల్ మ్యాచ్ ప్రసారాల హక్కు సోనీ నెట్‌వర్క్ సంస్థ వద్ద ఉన్నాయి. వచ్చే ఏడాదితో ఈ కాంట్రాక్టు పూర్తవుతుంది. 2018 నుంచి పదేళ్ల కాలానికి టీవీ, ఇంటర్నెట్, మొబైల్‌లో ఐపిఎల్ మ్యాచ్‌ల ప్రసార, సమాచార హక్కులను కేటాయించడానికి బిసిసిఐ పాలక మండలి సిద్ధమవుతున్నది. అయితే, ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఆర్‌ఎం లోధాకు సుప్రీం కోర్టు సూచించింది. బహుశా లోధా ఆధ్వర్యంలోనే కమిటీ ఏర్పడవచ్చని సమాచారం. సుప్రీం కోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో ఒక ప్రధాన హక్కు బిసిసిఐ చేజారిపోయింది. వివిధ లావాదేవీలను ఆడిట్ చేయించడం, ప్రసార హక్కులను పర్యవేక్షించడం వంటి కీలక అంశాలు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో జరిగితే, బోర్డు అధికారాలు కుదించుకపోవడం ఖాయం.