క్రీడాభూమి

అథ్లెట్ల కమిషన్ భేటీకి సైనా దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: నవంబర్‌లో జరుగునున్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) అథ్లెట్ల కమిషన్ సమావేశానికి హాజరు కాలేనని భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రకటించింది. ప్రస్తుతం తాను త్వరలో జరుగనున్న చైనా, హాంకాంగ్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్లకు సన్నాహకాల్లో మునిగిపోవడమే ఇందుకు కారణమని ఆమె వివరించింది. ఐఓసి అధ్యక్షుడు థామస్ బాచ్ గత నెలలో సైనా నెహ్వాల్‌ను అథ్లెట్ల కమిషన్‌లో సభ్యురాలిగా నియమించిన విషయం విదితమే. అయితే వచ్చే నెల ఆరంభంలో జరుగనున్న అథ్లెట్ల కమిషన్ తొలి సమావేశానికి తాను హాజరు కాలేనన్న విషయాన్ని ఐఓసికి తెలియజేయాల్సిందిగా కోరుతూ సైనా నెహ్వాల్ భారత ఒలింపిక్ కమిటీకి లేఖ రాసింది. ‘నవంబర్ 6 నుంచి 11వ తేదీ వరకు లాసానేలో జరిగే ఐఓసి అథ్లెట్ల కమిషన్ సమావేశంలో పాల్గొనాల్సిందిగా నన్ను ఆహ్వానించారు. అయితే త్వరలో జరిగే ప్రతిష్టాత్మక చైనా, హాంకాంగ్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నీల్లో ఆడతానని నిర్వాహకులకు ఇంతకుముందే హామీ ఇచ్చినందున ప్రస్తుతం ఆ టోర్నీలకు సన్నద్ధమవుతూ బిజీగా ఉన్నా. కనుక అథ్లెట్ల కమిషన్ సమావేశానికి నేను హాజరు కాలేనన్న విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమికీకి తెలియజేయాల్సిందిగా కోరుతున్నా’ అని సైనా నెహ్వాల్ ఆ లేఖలో పేర్కొంది.

అట్లెటికో మాడ్రిడ్‌కు
లా లిగా అవార్డుల పంట
మాడ్రిడ్, అక్టోబర్ 25: అట్లెటికో మాడ్రిడ్ ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందిన ఆంటోనీ గ్రీజ్మన్ 2015-16 సీజన్‌కు గాను లా లిగా ప్లేయర్‌గాఎంపిక కావడం అందరినీ ఆశ్చర్య పరిచింది. లా లిగాలో స్టార్ ఆటగాళ్లయిన లియోనిల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డ్‌లను కాకుండా గ్రీజ్‌మన్‌ను ఈ అవార్డు వరించడం గమనార్హం. కాగా, అట్లెటికోకు చెందిన డీగో సిమెయోన్ కోచ్ ఆఫ్ ది సీజన్ అవార్డును అందుకున్నాడు. బార్సిలోనా క్లబ్‌కు చెందిన ఉరుగ్వే ఆటగాడు లూయిస్ సౌరెజ్ టాప్ నాన్ ఇయు ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. వలెన్సియాలో సోమవారం జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో బార్సిలోనా క్లబ్‌కు చెందిన అర్జెంటీనా అంతర్జాతీయ క్రీడాకారుడు మెస్సీ బెస్ట్ ఫార్వర్డ్ ఆటగాడిగా ఎన్నికయినప్పటికీ అట్లెటికో అత్యధిక అవార్డులను ఎగరేసుకు పోయింది. ఈ క్లబ్‌కు చెందిన జాన్ ఒబ్లాక్ ఉత్తమ గోల్‌కీపర్ అవార్డును, డీగో గోడిన్ ఉత్తమ డిఫెండర్ అవార్డును దక్కించుకోగా, ఫ్రాన్స్‌కు చెందిన గ్రీజ్‌మన్ క్రీడాభిమానుల అవార్డును సైతం ఎగరేసుకు పోయాడు. లా లిగాలో టాప్ క్లబ్‌లలో ఒకటైన రియల్ మాడ్రిడ్‌కు చెందిన లూకా మోడ్రిక్ ఉత్తమ మిడ్‌ఫీల్డర్‌గా ఎంపిక కావడమొక్కటే ఆ జట్టుకు ఊరట కలిగించే అంశమైంది.