క్రీడాభూమి

హారిక జోరుకు కార్పోవ్ బేజారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్ డీ ఆగ్డే (ఫ్రాన్స్), అక్టోబర్ 25: ప్రపంచంలోని ప్రతిష్టత్మకమైన టోర్నమెంట్లలో ఒకటిగా పరిగణించే అనతోలీ కార్పోవ్ ర్యాపిడ్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నీ 14వ ఎడిషన్‌లో ‘తెలుగు తేజం’ ద్రోణవల్లి హారిక స్ఫూర్తివంతమైన ప్రదర్శనతో అలరించింది. నాలుగో రోజు జరిగిన తొలి గేమ్‌లో ఆమె ప్రపంచ మాజీ చాంపియన్ అనతోలీ కార్పోవ్‌ను ముప్పతిప్పలు పెట్టింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతున్న హారిక ఈ గేమ్‌లో తెల్ల పావులతో ఆడి కార్పోవ్‌కు దీటుగా ఎత్తులు వేసింది. దీంతో హరిక నుంచి ఎదురైన తీవ్రమైన ప్రతిఘటనను తట్టుకోలేకపోయిన కార్పోవ్ తన అనుభవాన్నంతా రంగరించి 51 ఎత్తుల్లో ఈ గేమ్‌ను డ్రాగా ముగించాల్సి వచ్చింది. అయితే నాలుగో రోజు ఫ్రాన్స్ ఆటగాడు ఎటెన్నీ బాక్రోట్‌తో జరిగిన రెండో గేమ్‌లో హారిక ఇదేవిధమైన జోరును కొనసాగించలేక ఓటమిపాలైంది. బాక్రోట్ చేతిలో ఇప్పటికే ఒకసారి ఓటమిపాలైన హారికకు అతని చేతిలో ఇది రెండో పరాజయం. ఈ టోర్నీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఐదో స్థానంలో నిలిచిన హరిక ఐదో రోజు స్పెయిన్‌కు చెందిన సబ్రినా వెగా గుటెర్రెజ్‌తో పాటు ఫ్రాన్స్‌కు చెందిన మథియు కార్నెట్టీతో తలపడనుంది.