క్రీడాభూమి

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత్ ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌంటన్ (మలేసియా), అక్టోబర్ 25: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో చిరకాల ప్రత్యర్థి అయిన పాక్‌పై ఘన విజయం సాధించి మంచి ఊపు మీదున్న భారత్ మంగళవారం చైనాకు చుక్కలు చూపించింది. ఆట ప్రారంభంనుంచి ధాటిగా ఆడిన భారత్‌కు చైనా ఏ దశలోను పోటీ ఇవ్వలేక పోయింది. ఆట ప్రారంభమైన తొమ్మిదో నిమిషంలో ఆకాశ్‌దీప్ సింగ్ తొలి గోల్ కొట్టి భారత్‌కు 1-0 ఆధిక్యత సాధించి పెట్టాడు. 39వ నిమిషంలో మరో గోల్ చేసి జట్టు ఆధిక్యతను మరింత ముందుకు తీసుకెళ్లాడు. కాగా యూసఫ్ అఫ్పన్ (19ని, 40 ని), జస్జిత్ సింగ్ కుమార్ (22ని, 51ని)లు చెరి రెండు గోల్స్ చేయగా, రూపిందర్ సింగ్, తిమ్మయ్య, ఉపాధ్యాయ తలా ఒక గోలు చేయడంతో 9-0 గోల్స్ తేడాతో చైనాను చిత్తు చేసింది. నిజానికి ఈ టోర్నమెంట్‌లో జపాన్‌పై చేసిన 10 గోల్స్ రికార్డును సమం చేయాలని భారత్ ప్రయత్నించింది కానీ సాధ్యపడలేదు. ఈ విజయంతో నాలుగు మ్యాచ్‌లనుంచి పది పాయింట్లతో భారత్ అగ్రస్థానం కోసం మలేసియాతో పోటీ పడనుంది. బుధవారం భారత్ మలేసియాతో తలపడబోతోంది. మూడు మ్యాచ్‌లు ఆడిన మలేసియా అన్ని మ్యాచ్‌లలో గెలిచి తొమ్మిది పాయింట్లతో ఉంది.
జపాన్‌పై పాక్ విజయం
కాగా, అంతకు ముందు జరిగిన మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్ జపాన్‌పై 4-3 గోల్స్ తేడాతో అతికష్టంమీద గెలిచింది. పాక్ జట్టులో ముహమ్మద్ అలీమ్ బిలాల్ రెండు పెనాల్టీ గోల్స్ చేసి జట్టుకు విజయం సాధించి పెట్టడంలో కీలకపాత్ర పోషించాడు. కాగా, ఇప్పటివరకు ఈ టోర్నమెంట్‌లో ఒక్క విజయం కూడా సాధించని జపాన్ ఈ మ్యాచ్‌లో సంచలన విజయం నమోదు చేస్తుందేమోననిపించింది. నిజానికి ప్రథమార్థం ముగిసే సమయానికి రెండు జట్లూ చెరి రెండు గోల్స్‌తో సమంగా ఉన్నాయి. కాగా, ఈ మ్యాచ్ సందర్భంగా భారీ వర్షం కారణంగా దాదాపు 40 నిమిషాల పాటు రెండు సార్లు ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ విజయంతో నాలుగు మ్యాచ్‌లలో ఆరు పాయింట్లతో ఉండగా, చివరి మ్యాచ్‌లో చైనాతో ఢీకొననుంది. ఆ మ్యాచ్‌లో భారీ విజయం సాధిస్తే పాక్ సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది.

ఆకాశ్‌దీప్ సింగ్ (కుడివైపు)