క్రీడాభూమి

సందిగ్ధంలో విశాఖ వనే్డ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆక్టోబర్ 26: ఈ నెల 29న భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య విశాఖలో జరగనున్న డే నైట్ వనే్డ మ్యాచ్ సందిగ్ధంలో పడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాను ‘కయాంత్’ ప్రభావం కోస్తాంధ్రపై ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. తుపాను కారణంగా ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు కోస్తా అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేస్తోంది. విశాఖ వనే్డకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదే సందర్భంలో మ్యాచ్ టికెట్ల విక్రయం కూడా 80 శాతం పూర్తయింది. ఈ నేపథ్యంలో తుపాను హెచ్చరికలు మ్యాచ్ జరుగుతుందా అన్న అనుమానాలకు తెరతీస్తోంది. ఎసిఎ - విడిసిఎ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌కు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సిద్ధంగా ఉంది. స్టేడియంలో ఉన్న అత్యాధునిక యంత్రాలతో నాలుగు గంటల్లో గ్రౌండ్‌ను ఆటకు సిద్ధం చేయగమని ఎసిఎ ధీమా వ్యక్తం చేస్తోంది. గ్రౌండ్‌లో నీటిని బయటకు పంపడంతో పాటు ఔట్‌ఫీల్డ్‌ను ఆరబెట్టే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని ఎసిఎ కార్యదర్శి గోకరాజు గంగరాజు వెల్లడించారు. జిల్లా యంత్రాంగం కూడా మ్యాచ్ నిర్వహణకు వర్షం అడ్డంకి ఉండకపోవచ్చని భావిస్తోంది. ఒక వేళ మ్యాచ్ జరగని పక్షంలో టికెట్ల మొత్తాన్ని తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. గతంలో విశాఖలో జరగాల్సిన రెండు మ్యాచ్‌లు ఈ విధంగా రద్దయిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య 2012 సెప్టెంబర్ 8న జరగాల్సిన టి-20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అలాగే భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య 2014 అక్టోబర్ 14న జరగాల్సిన వనే్డ కూడా రద్దయింది. ఈ రెండు సందర్భాల్లో టికెట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించారు. అయితే ఈ సారి మ్యాచ్‌కు నాలుగు గంటల ముందు వర్షం తగ్గితే మ్యాచ్ నిర్వహణ అసాధ్యమేమీ కాదని ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేస్తోంది.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఉత్తర కోస్తాపై కేంద్రీకృతమైన కయాంత్ తుపాను నెమ్మదిగా దక్షిణ కోస్తా, తమిళనాడు వైపు కదిలే అవకాశం ఉందని, దీనివల్ల విశాఖలో భారీ వర్షాలకు ఆస్కారం ఉండదని అంచనావేస్తున్నారు. ప్రస్తుతానికి భారత్, న్యూజిలాండ్ జట్లు ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో చెరి రెండు విజయాలతో సమవుజ్జీలుగా ఉన్నాయ. చివరి వనే్డ ఒకవేళ వర్షం కారణంగా రద్దయతే, సిరీస్ డ్రాగా ముగుస్తుంది. టెస్టు సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే.

సూపర్ ధోనీ
రాంచీ, అక్టోబర్ 26: భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తాను అత్యుత్తమ వికెట్‌కీపర్లలో ఒకడినని మరోసారి నిరూపించుకున్నాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్‌ను అతను రనౌట్ చేసిన తీరు ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. టేలర్ కొట్టిన బంతిని బౌండరీ వద్ద ఆపేసిన అక్షర్ పటేల్ దానిని ధోనీకి త్రో చేశాడు. వికెట్లకు అభిముఖంగా నిలబడి, బంతిని అందుకున్న ధోనీ వెనక్కి తిరిగి చూడకుండానే దానిని వికెట్లకేసి కొట్టాడు. క్రీజ్‌లో చేరుకోవడం క్షణకాలం ఆలస్యమైన కారణంగా టేలర్ రనౌటయ్యాడు. ఒకవేళ ధోనీ బంతిని సేకరించిన తర్వాత వెనక్కు తిరిగి, ఆతర్వాత వికెట్లను గురి చూసి విసిరి ఉండే, ఆ వ్యవధిలో టేలర్ క్రీజ్‌లోకి వచ్చేసేవాడు. అరనౌట్‌ను తప్పించుకునేవాడు. కానీ, ధోనీ ప్రతిభ అతనికి ఆ అవకాశం ఇవ్వలేదు.