క్రీడాభూమి

హింగిస్‌తో సానియా దోస్తీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి మార్టినా హింగిస్‌తో కలిసి మహిళల డబుల్స్‌లో అపూర్వ విజయాలను అందుకున్న తర్వాత కొంతకాలం ఆమెతో విడిపోయి, వేర్వేరు భాగస్వాములతో కలిసి ఆడిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మళ్లీ పాత స్నేహితురాలి పట్ల మొగ్గు చూపుతున్నది. ఈ ఏడాది ఆరంభంలో విడిపోయే సమయానికి ఈ జోడీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉంది. వీరిద్దరూ కలిసి మూడు గ్రాండ్ శ్లామ్, 11 డబ్ల్యుటిఎ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. మహిళల డబుల్స్ విభాగంలో తిరుగులేని ఆధిక్యాన్ని కనబరచిన వీరు విడిపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. అయితే, డబ్ల్యుటిఎ ఫైనల్స్ టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి మరోసారి హింగిస్‌తో కలిసి పోటీపడాలని సానియా నిర్ణయించింది. హింగిస్‌తో విడిపోయిన తర్వాత బార్బరా స్ట్రికోవాతో కలిసి సానియా డబుల్స్ మ్యాచ్‌లు ఆడింది. హింగిస్ తనకు జోడీగా అమెరికాకు చెందిన కొకొ వాండెవాగ్‌ను ఎంచుకుంది. డబ్ల్యుటిఎ ఫైనల్స్‌లో తాము ఎంపిక చేసుకున్న భాగస్వాములతో కలిసి ఆడేందుకు ఇరువురు ఇష్టపడకపోవడంతో, మరోసారి జోడీ కట్టడానికి సిద్ధమయ్యారు.
హైదరాబాదీ నంబర్‌వన్
ఇటీవల ప్రకటించిన టెన్నిస్ ప్రపంచ ర్యాంకింగ్స్ మహిళల డబుల్స్ విభాగంలో హైదరాబాదీ సానియా నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. చెక్ రిపబ్లిక్‌కు చెందిన స్ట్రికోవాతో కలిసి ఆమె ఇటీవలే పాన్ పసిఫిక్ టోర్నమెంట్ టైటిల్‌ను సాధించింది. దీనితో ఆమె మొత్తం 9,730 పాయింట్లతో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించగా, గతంలో ఆమెకు డబుల్స్ భాగస్వామిగా ఉన్న హింగిస్ 9,725 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నది. మొదటి రెండు ర్యాంకుల్లో ఉన్న క్రీడాకారుణులు ఒకే జట్టులో పోటీపడనున్న నేపథ్యంలో డబ్ల్యుటిఎ ఫైనల్స్ టైటిల్‌ను వీరు నిలబెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఫ్రెంచ్ ఓపెన్ బాడ్మింటన్
సింధు శుభారంభం

పారిస్, అక్టోబర్ 26: ఫ్రెంచ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్, రియో ఒలింపిక్స్ ర జత పతక విజేత పివి సింధు శుభారంభం చేసిం ది. డెన్మార్క్ ఓపెన్‌లో రెండో రౌండ్‌లోనే నిష్క్ర మించి, అభిమానులను నిరాశపరచిన ఆమె, ఫ్రెం చ్ ఓపెన్ తొలి రౌండ్‌లో హంకాంగ్‌కు చెందిన ఇప్ పయ్ ఇన్‌ను 21-9, 29-27 తేడాతో ఓడించింది. మొదటి సెట్‌ను సులభంగానే సొంతం చేసుకున్న సింధుకు రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్ర స్థా యలో ప్రతిఘటన ఎదురైంది. అయతే, అతి కష్టం మీద ఆ సెట్‌ను కూడా సొంతం చేసుకున్న సింధు రెండో రౌండ్ చేరింది.
పురుషుల సింగిల్స్‌లో స్విస్ ఓపెన్ విజేత హెచ్ ఎస్ ప్రణయ్ రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. మొదటి రౌండ్‌లో అతను థాయలాండ్‌కు చెందిన బూన్సాక్ పొన్సానాను 21-16, 21-18 తేడాతో ఓ డించాడు. అయతే, అజయ్ జయరామ్ పోరు మొ దటి రౌండ్‌లోనే ముగిసింది. ఇండోనేషియా ఆట గాడు ఆంథోనీ సినిసకా గింటింగ్‌తో తలపడిన అ తను 22-20, 10-21, 18-21 తేడాతో పరాజయా న్ని చవిచూశాడు. అయతే, విజయం కోసం అత ను కడవరకూ చేసిన పోరాటం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.