క్రీడాభూమి

మోదీ.. జాన్ కీ.. క్రికెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో వనే్డ ఇంటర్నేషనల్ రాంచీలో ప్రారంభం కావడానికి కొద్ది సేపటి ముందు ఇరు దేశాల ప్రధానులు క్రికెట్ పదాలను, క్రికెటర్లను ప్రస్తావిస్తూ విలేఖరుల సమావేశాన్ని రక్తికట్టించారు. ద్వైపాక్షిక ఒప్పందాలను ఈ సమావేశంలో వెల్లడిస్తున్న సమయంలో భారత ప్రధాని మోదీ ముందుగా క్రికెట్ ప్రస్తావన తెచ్చారు. నాలుగో వనే్డ ఆరంభం కానునన్న నేపథ్యంలో, కొన్ని ఒప్పందాల వివరాలు క్రికెట్ పరిభాషకు అతికినట్టు సరిపోతాయని మోదీ అన్నారు. ‘లాంగ్ ఆఫ్ ఫీల్డింగ్ నుంచి పిచ్‌పై బ్యాటింగ్ కోసం గార్డ్‌ను తీసుకునే వరకూ ముందంజ వేశాం. రక్షణాత్మక విధానం దూకుడుగా అడేందుకు అవసరమైన మార్గాన్ని వేసింది’ అని చమత్కరించారు. భారత్, న్యూజిలాండ్ ప్రధానుల చర్చలు, తీసుకున్న నిర్ణయాలను ఆయన క్రికెట్‌తో పోలుస్తూ, విలేఖరుల సమావేశంలో మోదీ నవ్వులు పూయించారు. అనంతరం న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న వనే్డ సిరీస్‌లో భారత్ ఆధిపత్యాన్ని ప్రస్తావించకుండా మోదీ హుందాగా వ్యవహరించారని అన్నారు. రెం డు దేశాల మధ్య మైత్రీ బంధం మరింత బలపడాలని అన్నారు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ ఐపిఎల్‌లో గుజరాత్ లయన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయాన్ని జాన్ కీ ప్రస్తావించారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ కావడంతో, జాన్ కీ ప్రత్యేకించి మెక్‌కలమ్ గురించి మాట్లాడారు. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలకు ఇదో నిదర్శనమన్నారు.
భారత్, న్యూజిలాండ్ ప్రధానులు నరేంద్ర మోదీ, జాన్ కీ