క్రీడాభూమి

జిదానె ‘తొలి’ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, జనవరి 10: పరాజయాలతో అల్లాడుతూ పరువు పోగొట్టుకున్న రియల్ మాడ్రిడ్ జట్టు కోచ్‌గా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న ఫ్రాన్స్ మాజీ ఫుట్‌బాలర్ జినెదిన్ జిదానె తొలి మ్యాచ్‌లోనే తనదైన ముద్ర వేశాడు. గెరాత్ బాలే హ్యాట్రిక్‌తో డిపోరిటవో లా కొరునాను రియల్ మాడ్రిడ్ 5-0 తేడాతో చిత్తుచేయడంతో కోచ్‌గా జిదానె చిరస్మర ణీయమైన వియాన్ని అందుకు న్నాడు. ఏడు నెలల క్రితం కోచ్‌గా ఎంపికైన రాఫెల్ బెనిటెజ్ దారుణంగా విఫలమయ్యాడు. ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో రియల్ మాడ్రిడ్ కనీసం నాకౌట్ దశను కూడా చేరకుండానే నిష్క్రమించింది. సొంత గడ్డపై చిరకాల ప్రత్యర్థి బార్సిలోనా చేతిలో చావు దెబ్బతినడంతో రియల్ మాడ్రిడ్ ఆటగాళ్లతోపాటు కోచ్ బెనిటెజ్‌పైనా అభిమానులు నిప్పులు చెరిగారు. జట్టు ప్రమాణాలు ఒక్కసారిగా పడిపోవడంతో కంగుతిన్న క్లబ్ యాజమాన్యం బెనిటెజ్‌పై వేటు వేసింది. రియల్ మాడ్రిడ్‌కు 25 మ్యాచ్‌ల్లో కోచ్‌గా వ్యవహరించిన బెనిటెజ్ స్థానంలో జిదానెను నియమించింది. ఇలావుంటే, ఆటగాడిగా పేరుప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ, కోచ్‌గా జిదానె ఇంకా తనను తాను నిరూపించుకోలేదు. రియల్ మాడ్రిడ్‌కు అనుబంధంగా ఉన్న కాస్టిల్లా జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. సుమారు ఒకటిన్నర సంవత్సరాలు అతను ఎలాంటి ప్రమోషన్ లేకుండా అసిస్టెంట్ స్థానంతోనే సంతృప్తి చెందాడు. అనూహ్యంగా అతను ఏకంగా రియల్ మాడ్రిడ్‌కే కోచ్‌గా ఎంపికకావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.
ఇలావుంటే, మ్యాచ్ 15వ నిమిషంలో తొలి గోల్ చేసిన కరీం బెంజిమా 90వ నిమిషంలో మరో గోల్ చేశాడు. మధ్యలో గెరాత్ బాలే 22, 49, 63 నిమిషాల్లో వరుసగా మూడు గోల్స్‌తో హ్యాట్రిక్‌ను నమోదు చేయడంతో ప్రైమెరా డివిజన్ పోరులో రియల్ మాడ్రిడ్ విజయభేరి మోగించింది. పాయింట్ల పట్టికలో బార్సిలోనా మొత్తం 42 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, అట్లెటికో మాడ్రిడ్ 41 పాయింట్లు సంపాదించుకొని రెండో స్థానంలో ఉంది. రియల్ మాడ్రిడ్ 40 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. ఫామ్‌ను కోల్పోయి, ఇటీవల కాలంలో పరాజయాల బాటను వీడని రియల్ మాడ్రిడ్ ఈ విజయంతో సత్తా చాటింది. జిదానె రాకతో ఈ జట్టు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, అందుకే, తిరుగులేని ఆధిపత్యాన్ని కనబర్ని విశే్లషకులు అంటున్నారు. అతని పర్యవే క్షణలో రియల్ మాడ్రిడ్‌కు మళ్లీ మంచి రోజు లు రావడం ఖాయం. ఆటగాళ్లు కూడా అదే ధీమా వ్యక్తం చేస్తున్నారు.