క్రీడాభూమి

గోవా చేతిలో కేరళ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, నవంబర్ 29: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఆదివారం ప టిష్టమైన గోవా ఫుట్‌బాల్ క్లబ్‌ను ఢీకొన్న కేరళ బ్లా స్టర్స్ చిత్తయంది. 5-1 తేడాతో ఈ మ్యాచ్‌ని కైవసం చేసుకున్న గోవా పాయంట్ల పట్టికలో రెండో స్థానికి చేరింది. డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో కోల్‌కతా 23 పాయంట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించగా గోవా ఖాతాలో ఇప్పుడు 22 పాయంట్లు ఉన్నాయ. ఆదివా రం నాటి మ్యాచ్ ఆరంభమైన రెండో నిమిషంలోనే విక్టర్ పల్గా చేసిన గోల్‌తో కేరళ 1-0 ఆధిక్యానికి దూసుకెళ్లింది. అయతే, మరో ఏడు నిమిషాల్లోనే జొ ఫ్రే ద్వారా గోవాకు ఈక్వెలైజర్ లభించింది. ఆతర్వా త రినాల్డో విజృంభణ కొనసాగింది. 29, 50, 60 ని మిషాల్లో గోల్స్ చేయడం ద్వారా హ్యాట్రిక్ సృష్టించి న అతను గోవా ఆధిక్యాన్ని 4-1కి చేర్చాడు. 64వ ని మిషంలో మందర్ దేశాయ్ చేసిన గోల్‌తో ఈ ఆధి క్యం 5-1కు చేరింది. మరో గోల్ నమోదు కాకపోవ డంతో కేరళ తిరుగులేని విజయాన్ని నమోదు చేసిం ది. ఈ టోర్నమెంట్‌లో చాలా మ్యాచ్‌లు నిస్సారం గా, పూర్తి రక్షణాత్మక విధానంలో కొనసాగుతుంటే, ఆదివారం అందుకు భిన్నంగా గోవా జట్టు రెచ్చిపో యంది. ఒక దాని తర్వాత మరొకటిగా గోల్స్ నమో దవుతుండగా, ఇక్కడి జవహర్ లాల్ నెహ్రూ స్టేడి యంలో మ్యాచ్‌ని చూసేందుకు హాజరైన సుమారు 32 వేలం మంది ప్రేక్షకులు కేరింతలు కొట్టారు.