క్రీడాభూమి

చెన్నై ఓపెన్ టెన్నిస్ విజేత వావ్రిన్కా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 10: చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్‌ను డిఫెండింగ్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రిన్కా నిలబెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో అతను బొర్నా కొరిక్‌ను 6-3, 7-5 తేడాతో ఓడించి ట్రోఫీని అందుకున్నాడు. ఈ టోర్నీలో అతను వరుసగా 12 మ్యాచ్‌లను గెల్చుకొని సత్తా చాటాడు. సుమారు ఒకటిన్నర గంటలు జరిగిన పోరులో మొదటి సెట్‌ను సులభంగానే సాధించిన వావ్రిన్కాకు రెండో సెట్‌లో కొరిక్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. అయితే, అతను తన అపారమైన అనుభవంతో ఆ సెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.