క్రీడాభూమి

అజ్మల్ మోసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, జనవరి 10: పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ సరుూద్ అజ్మల్ మోసం చేశాడని అతని స్వస్థలమైన ఫైసలాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరోపించింది. అకాడెమీని ఏర్పాటు చేసుకోవడానికి తాము కేటాయించిన స్థలాన్ని దుర్వినియోగం చేశాడని ఆరోపించింది. తక్షణమే ఖాళీ చేయాలని డిమాండ్ చేసింది. వివరాల్లోకి వెళితే, క్రికెట్ కోచింగ్ అకాడెమీని పెట్టుకోవడానికి విశ్వవిద్యాలయం కొంత స్థలాన్ని అజ్మల్‌కు కొన్ని షరతులపై కేటాయించింది. అయితే, అకాడెమీని పెట్టిన తర్వాత అతను ఒక్కో విద్యార్థి నుంచి 15,000 రూపాయలు చొప్పున వసూలు చేయడంతో వివాదం తలెత్తింది. సమర్థులైన వారికి ఉచితంగా లేదా నామమాత్రపు ఫీజుతో శిక్షణ ఇవ్వాలని తాము విధించిన షరతును ఉల్లంఘించిన అజ్మల్ సుమారు 350 మంది నుంచి 50.3 లక్షల రూపాయలు వసూలు చేశాడని విశ్వవిద్యాలయ అధికారులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అజ్మల్‌ను వెంటనే ఖాళీ చేసి, తమ స్థలాన్ని తిరిగి అప్పగించాలని గత ఏడాది డిమాండ్ చేశారు. కానీ, ఈ హెచ్చరికలను అజ్మల్ పట్టించుకోలేదు. అకాడెమీ స్థలాన్ని విడిచిపెట్టేందుకు నిరాకరించాడు. సుమారు ఏడాది సాగిన ఈ వివాదానికి తెరదించాలని అధికారులు నిర్ణయించారు. అజ్మల్‌ను ఖాళీ చేయించాలని పాలక మండలి సమావేశంలో తీర్మానించారు. ఇలావుంటే, తాను ఎలాంటి మోసానికి పాల్పడలేదని అజ్మల్ అన్నాడు. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ, విద్యార్థులకు కిట్‌ను కొనడంతోపాటు అకాడెమీ ఖర్చుల నిమిత్తమే తాను కొంత మొత్తాన్ని వసూలు చేసినట్టు తెలిపాడు. బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉందని 2014లో తనను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) సస్పెండ్ చేసిన నాటి నుంచి విశ్వవిద్యాలయ అధికారుల తీరు మారిందని ఆరోపించాడు. అన్యాయంగా తనను ఖాళీ చేయాల్సిందిగా కోరుతున్నారని అన్నాడు. నిబంధనలకు లోబడే అకాడెమీ నడుస్తున్నదని, ఎంతో ఖర్చుతో సిద్ధం చేసుకున్న అకాడెమీని ఎత్తివేయాలని అనడం సమంజసం కాదని చెప్పాడు. తనపై విధించిన సస్పెన్షన్‌ను ఐసిసి ఎత్తివేసిన విషయాన్ని అతను గుర్తుచేశాడు. విశ్వవిద్యాలయం అధికారులు అకారణంగా తనపై నేరారోపణలు చేస్తూ, ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తాడు. అకాడెమీని కొనసాగించడమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు.