క్రీడాభూమి

భారత్‌లో ఇంగ్లాండ్‌కు కష్టాలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 4: భారత్ పర్యటనలో ఇంగ్లాండ్‌కు కష్టాలు తప్పవని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ స్పష్టం చేశాడు. క్రికెటర్‌గా, కోచ్‌గా తనకు ఉన్న అనుభవంతో ఈ విషయాన్ని చెప్తున్నానని ఐపిఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు చాలాకాలంగా ఫీల్డింగ్ కోచ్‌గా సేవలు అందిస్తున్న రోడ్స్ శుక్రవారం పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. టీమిండియాను భారత్‌లోనే ఎదుర్కోవడం అనుకున్నంత సులభం కాదన్నాడు. అందులోనూ, ఐదు టెస్టుల సిరీస్ ఆడడం వల్ల ఇంగ్లాండ్ క్రికెటర్లు శారీరకంగా, మానసికంగా కుంగిపోతారని జోస్యం చెప్పాడు. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత టెస్టు జట్టులో చాలా మంది సమర్థులు ఉన్నారని అన్నాడు. పిచ్‌లు భారత బౌలర్లకు సహకరిస్తాయని, స్పిన్నర్లు విశ్వరూపం ప్రదర్శిస్తారని అభిప్రాయపడ్డాడు. భారత్ పిచ్‌ల తీరును తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇంగ్లాండ్ బౌలర్లు చాలా కష్టపడాల్సి ఉంటుందన్నాడు. ఏ రకంగా చూసినా ఇంగ్లాండ్ కంటే భారత్ పటిష్టంగా కనిపిస్తున్నదని రోడ్స్ అన్నాడు.

ప్రభుత్వం అనుమతిస్తే
2020లో ఆసియా బీచ్ గేమ్స్: ఐఒఎ
చెన్నై, నవంబర్ 4: కేంద్ర ప్రభుత్వం అనుమిస్తే, 2020లో ఆసియా బీచ్ గేమ్స్‌ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) ప్రకటించింది. శుక్రవారం సమావేశమైన ఐఒఎ కార్యవర్గం ఈ నిర్ణయం తీసుకుంది. మహారాష్టల్రో ఈ గేమ్స్‌ను నిర్వహించాలని లాంఛనంగా తీర్మానించింది. అంతర్జాతీయ టోర్నీలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరని, అక్కడి నుంచి ఆమోద ముద్ర లభిస్తేనే ఆసియా బీచ్ గేమ్స్ నిర్వహణ మన దేశంలో సాధ్యమవుతుందని పేర్కొంది.
బిఎఫ్‌ఐపై త్రిసభ్య కమిటీ
ఇటీవల ఏర్పడిన భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎస్‌ఎఫ్)కు గుర్తింపునిచ్చే ప్రక్రియను పూర్తి చేయడానికి ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని వేసినట్టు ఐఒఎ ప్రకటించింది. ఐఒఎ ప్రతిపాదించిన తర్వాత బిఎస్‌ఎఫ్‌ను అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం అధికారికంగా గుర్తిస్తుంది.