క్రీడాభూమి

లండన్‌కు రోహిత్ ఆసీస్‌తో సిరీస్‌కూ అనుమానమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 4: భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ వైద్య చికిత్స కోసం లండన్‌కు వెళ్లనున్నాడు. న్యూజిలాండ్‌తో విశాఖపట్నంలో జరిగిన చివరి, ఐదో వనే్డ ఇంటర్నేషనల్‌లో ఆడుతున్నప్పుడు అతని తొడ కండరాలు చిట్లాయి. మందులతో ఫలితం ఉండదన్న అభిప్రాయంతో, నిపుణుల సలహా కోసం అతను ఇంగ్లాండ్ వెళతాడు. అక్కడ జరిపే పరీక్షల ఫలితాలను బట్టి శస్త్ర చికిత్సపై వైద్యులు నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో అతనికి కనీసం మూడు వారాల విశ్రాంతి అవసరమని బిసిసిఐ ఇప్పటికే ప్రకటించింది. అందుకే, అతను ఇంగ్లాండ్‌తో జరిగే ఏ సిరీస్‌లోనూ ఆడబోడని స్పష్టం చేసింది. ఒకవేళ ఆపరేషన్ జరిగితే అతను కనీసం 10 నుంచి 12 వారాలు క్రికెట్‌కు దూరమవుతాడు. శస్త్ర చికిత్స అనివార్యంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ సిరీస్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లోనూ అతను ఆడే అవకాశం లేదు.

నెట్ ప్రాక్టీస్‌లో
కుక్ సేన బిజీ
ముంబయి, నవంబర్ 4: భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం అలిస్టర్ కుక్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు శుక్రవారం బ్రబౌర్న్ స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేసింది. బంగ్లాదేశ్ టూర్‌ను ముగించుకొని రెండు రోజుల క్రితం ఇంగ్లాండ్ క్రికెటర్లు ఇక్కడికి చేరుకున్న విషయం తెలిసిందే. జట్టులోని మొత్తం 16 మంది సభ్యులు మొదటి సెషన్‌లో నాలుగు గంటలు ప్రాక్టీస్ చేశారు. ఇది తప్పనిసరిగా పాల్గొనాల్సిన నెట్స్ కాకపోయినప్పటికీ కుక్ బృందం మైదానంలో చెమటోడ్చింది. శనివారం కూడా ఇంగ్లాండ్ క్రికెటర్లు నెట్స్‌కు హాజరవుతారు. ఈనెల 9 నుంచి ప్రారంభమయ్యే మొదటి టెస్టు మ్యాచ్‌లో ఆడేందుకు రాజ్‌కోట్‌కు ఆదివారం బయలుదేరి వెళతారు. రెండు జట్ల మధ్య ఐదు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లున్న సిరీస్ జరగడం 1984-85 సీజన్ తర్వాత ఇదే మొదటిసారి. అప్పట్లో భారత జట్టుకు సునీల్ గవాస్కర్, ఇంగ్లాండ్ జట్టుకు డేవిడ్ గోవర్ నాయకత్వం వహించారు.