క్రీడాభూమి

లోధా కమిటీకి బిసిసిఐ అఫిడవిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 5: సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి, లోధా కమిటీకి భారత క్రికె ట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) శనివారం అఫిడవిట్‌ను దాఖలు చేసింది. లోధా కమిటీ చే సిన సిఫార్సుల అమలుపై అభ్యంతరాలను తెలపాలంటూ సుప్రీం కోర్టు ఇది వ రకే బోర్డుకు తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే బిసిసిఐ అధ్యక్షడు అనురాగ్ ఠాకూర్, కార్య దర్శి అజయ్ షిర్కే తమ అభ్యంతరాలను తెలుపుతూ అఫిడవిట్ ఇచ్చారు. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి, లోధా సిఫార్సులను ఎలాంటి మార్పులు లేకుండా అమలు చే యాల్సిన అవసరం ఉందంటూ సర్వసభ్య సమావేశంలో ప్రతిపాదన పెట్టామని, అయతే, అధికశాతం మంది సభ్యులు దీనిని పూర్తిగా తిరస్కరించారని ఠాకూర్ తన 50 పేజీలతో కూడిన అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. మెజారిటీ సభ్యుల అనుమతి లేనిదే నిబంధనావళిని మార్చడం సాధ్యం కాదని ఠాకూర్ స్పష్టం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో సిఫార్సులను అమలు చేయడం కుదరని పేర్కొన్నాడు. కాగా, షిర్కే కూడా లోధా సిఫార్సుల్లో కొన్ని అం శాలను ప్రస్తావిస్తూ, అవి దేశంలో క్రికెట్‌ను దెబ్బతీసేవిగా ఉన్నాయని తెలిపాడు.