క్రీడాభూమి

ఆసక్తి రేపుతున్న కొజికోడ్ క్రికెట్ లైబ్రరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొజికోడ్, నవంబర్ 5: మలబార్ క్రిస్టియన్ కాలేజీలో చరిత్ర శాఖాధిపతి వశిష్ఠ్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న క్రికెట్ లైబ్రరీ ఆసక్తి రేపుతున్నది. అభిమానులను ఆకట్టుకుంటున్నది. దేశంలోనే ఒక క్రీడకు సంబంధించిన లైబ్రరీని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు, బెంగాలీ, కన్నడ, ఒరియా తదితర భాషల్లో క్రికెట్‌పై ముద్రితమైన వందలాది పుస్తకాలను అభిమానుల కోసం అందుబాటులో ఉంచినట్టు వశిష్ఠ్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘22 యార్డ్స్ టు ఫ్రీడమ్’ పేరుతో ఏర్పాటైన ఈ గ్రంధాలయంలో క్రికెట్‌పై సమగ్ర సమాచారాన్ని అందించే పుస్తకాలు, మ్యాగజైన్లు, స్టడీ మెటీరియల్స్‌ను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ‘సచిన్ గ్యాలరీ’ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగంపై ఎక్కువ మంది ఆసక్తిని చూపుతున్నారని తెలిపారు. క్రికెట్‌కు మాత్రమే ప్రత్యేకించిన లైబ్రరీ, అందులో ఒక క్రీడాకారుడిపై గ్యాలరీల ఏర్పాటు దేశంలో ఇదే ప్రథమమని అన్నారు. క్రికెట్ లైబ్రరీని మరింత విస్తరించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.