క్రీడాభూమి

తోమర్ చేతిలో పాక్ రెజ్లర్ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, నవంబర్ 5: కామనె్వల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత వీరుడు సందీప్ తోమర్ చిరకాలం గుర్తుండిపోయే విజయాన్ని సాధించాడు. పురుషుల 57 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో తోమర్ 6-0 తేడాతో పాక్ రెజ్లర్ మహమ్మద్ బిలాల్‌ను 6-0 తేడాతో చిత్తుచేసి స్వర్ణ పతకం సాధించాడు. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో పాక్ రెజ్లర్‌పై తోమర్ విజయం సాధించి పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలావుంటే, ఈ ఈవెంట్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగింది. 70 కిలోల విభాగంలో అమిత్ ధంకర్ స్వర్ణ పతకాన్ని అందుకోగా, అతని చేతిలో ఓడిన వినోద్‌కు రజత పతకం లభించింది. 97 కిలోల విభాగంలోనూ భారతీయులే ఫైనల్ చేరుకోవడం విశేషం. టైటిల్ బౌట్‌లో పోటీపడాల్సిన రూబల్జీత్ గాయం కారణంగా పోటీకి దికపోవడంతో సత్యవ్రత్ కడియన్‌ను విజేతగా ప్రకటించారు.
పురుషుల గ్రీకో రోమన్ 66 కిలోల ఈవెంట్‌లో మనీష్ (స్వర్ణం), రవీందర్ (రజతం), 75 కిలోల విభాగంలో గుర్‌ప్రీత్ సింగ్ (స్వర్ణం), దినేష్ (రజతం), 80 కిలోల విభాగంలో హర్‌ప్రీత్ సింగ్ (స్వర్ణం), రవీందర్ ఖాత్రి (రజతం), 85 కిలోల ఈవెంట్‌లో ప్రభుపాల్ (స్వర్ణం), యశ్పాల్ (రజతం), 130 కిలోల విభాగంలో నవీన్ (స్వర్ణం), మన్వీర్ (రజతం) పతకాలు సాధించారు.
మహిళల ఫ్రీస్టయిల్ 48 కిలోల విభాగంలో రీతూ ఫొగత్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో ఆమె ప్రియాంకపై గెలిచింది. 55 కిలోల విభాగంలో లలిత్ (స్వర్ణం), దియాంశి (రజతం), 58 కిలోల విభాగంలో మన్నూ (స్వర్ణం), సోమాలీ (రజతం), 60 కిలోల ఈవెంట్‌లో సరిత (రజతం), నమీష్ (కాంస్యం), 63 కిలోల విభాగంలో రేష్మా (స్వర్ణం), గాగ్రి (రజతం), 69 కిలోల విభాగంలో పింకీ (స్వర్ణం), కవిత (రజతం), 75 కిలోల ఈవెంట్‌లో జ్యోతి (రజతం), నిక్కీ (కాంస్యం) పతకాలు సాధించారు.

చిత్రం.. సందీప్ తోమర్