క్రీడాభూమి

జొకోవిచ్‌కు సిలిక్ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, నవంబర్ 5: ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్‌కు ఇక్కడ జరుగుతున్న పారిస్ మాస్టర్స్‌లో చుక్కెదురైంది. ఇటీవల కాలంలో ఫామ్ కోల్పోయి బాధపడుతున్న జొకోవిచ్‌పై క్రొయేషియా ఆటగాడు మారిన్ సిలిక్ క్వార్టర్ ఫైనల్‌ను 6-4, 7-6 తేడాతో గెల్చుకొని సంచలనం సృష్టించాడు. ఈ ఓటమి జొకోవిచ్‌ను టోర్నీ నుంచి దూరం చేయడమేగాక, నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయే ప్రమాదంలో పడేసింది. మరో క్వార్టర్ ఫైనల్‌లో థామస్ బెర్డిచ్‌పై 7-6, 7-5 ఆధిక్యంతో అతి కష్టం మీద గెలిచిన బ్రిటిష్ స్టార్ ఆండీ ముర్రే మరో విజయాన్ని నమోదు చేస్తే, జొకోవిచ్‌ను రెండో స్థానంలోకి నెట్టేసి, తాను ఆ స్థానాన్ని ఆక్రమిస్తాడు. మిలోస్ రోనిక్‌తో సెమీ ఫైనల్‌లో తలపడనున్న ముర్రేకు ఆ మ్యాచ్ ప్రాధాన్యం బాగా తెలుసు. ప్రపంచ నంబర్ వన్ స్థానంపై దృష్టిపెట్టిన అతను రోనిక్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. క్వార్టర్ ఫైనల్‌లో రోనిక్ 6-2, 7-6 ఆధిక్యంతో జో విల్‌ఫ్రైడ్ సొంగాను ఓడించాడు. కాగా, రెండో సెమీ ఫైనల్‌లో జాన్ ఇస్నర్‌ను సిలిక్ ఢీ కొంటాడు. ఇస్నర్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ని జాక్ సాక్‌పై 7-6, 4-6, 6-4 స్కోరుతో సొంతం చేసుకున్నాడు. మొత్తం మీద ముర్రేను ప్రపంచ నంబర్ వన్‌గా నిలబెట్టే అవకాశాలున్న సెమీ ఫైనల్ పోరు టైటిల్ యుద్ధాన్ని తలపించడం ఖాయంగా కనిపిస్తున్నది. జొకోవిచ్‌ని సిలిక్ ఓడించడం పరోక్షంగా ముర్రేకు కలిసొచ్చింది.