క్రీడాభూమి

మమ్మల్ని ఓడించడం సులభం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, జనవరి 11: తమను ఓడించడం టీమిండియాకు అనుకున్నంత సులభం కాదని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ జార్జి బెయిలీ అన్నాడు. మంగళవారం తొలి మ్యాచ్‌తో వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్ ఆరంభంకానున్న నేపథ్యంలో అతను ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్, ఆసీస్ జట్ల మధ్య పోరాటం ఎప్పుడూ తీవ్రంగానే ఉంటుందన్నాడు. ఇటీవల కాలంలో ఆసీస్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నదని చెప్పాడు. తమను స్వదేశంలో ఓడించడానికి టీమిండియా చాలా కష్టపడాలని అన్నాడు. వనే్డ సిరీస్‌ను కైవసం చేసుకుంటామని అతను ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌ను తక్కువ అంచనా వేయడం లేదని, అయితే, జట్టులోని ఆటగాళ్లపై తనకు నమ్మకం ఉందని చెప్పాడు.

రికార్డు చేరువలో కోహ్లీ
పెర్త్, జనవరి 11: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. వనే్డల్లో 7,000 పరుగులు మైలురాయిని చేరుకోవడానికి 169 పరుగుల దూరంలో నిలిచాడు. ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో అతను ఈ పరుగులను పూర్తి చేయడం ఖాయం. కాగా, ఏడు వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న బ్యాట్స్‌మన్‌గా రికార్డు దక్షిణాఫ్రికా స్టార్ ఎబి డివిలియర్స్ పేరిట ఉంది. అతను 166 ఇన్నింగ్స్‌లో ఈ లక్ష్యాన్ని చేరాడు. కాగా, ఆ రికార్డును బద్దలు చేసేందుకు కోహ్లీ సిద్ధమవుతున్నాడు. అతను ఇప్పటి వరకూ 158 ఇన్నింగ్స్‌లో 6,831 పరుగులు చేశాడు. కాబట్టి, డివిలియర్స్ కంటే వేగంగా ఏడువేల పరుగులను పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వరుస విజయాలు
ఆస్ట్రేలియా 2014 నవంబర్ నుంచి స్వదేశంలో ఇప్పటి వరకూ 14 వరుస విజయాలను నమోదు చేసింది. దక్షిణాఫ్రికాతో పెర్త్‌లోనే 2014 నవంబర్ 16న జరిగిన వనే్డలో ఆ జట్టు చివరిసారి ఓడింది. కాగా, 2000 నుంచి ఆసీస్ జట్టు ఇప్పటి వరకూ వివిధ దేశాలతో 17 ద్వైపాక్షిక సిరీస్‌లను స్వదేశంలో ఆడింది. వాటిలో కేవలం 3 సిరీస్‌లు మాత్రమే కోల్పోయింది.
ఒకే శతకం
ఆస్ట్రేలియా జట్టుపై ఆస్ట్రేలియాతో 2008 నుంచి ఇప్పటి వరకూ జరిగిన ఎనిమిది వనే్డల్లో భారత తరఫున ఒకే ఒక శతకం నమోదైంది. గత ఏడాది జనవరిలో మెల్బోర్న్‌లో జరిగిన వనే్డలో రోహిత్ శర్మ 138 పరుగులు చేశాడు. కాగా, గత ఏడాది వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాలోనే వివిధ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో భారత్ ఆరు మ్యాచ్‌లు ఆడి, మూడు శతకాలను సాధించింది.