క్రీడాభూమి

నేడు ఐపిఎల్ పాలక మండలి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 7: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ 10వ ఎడిషన్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించిన అంశాల గురించి చర్చించేందుకు ఐపిఎల్ పాలక మండలి మంగళవారం న్యూఢిల్లీలో సమావేశం కానుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలతో పాటు ఐపిఎల్ పాలక మండలి చైర్మన్ రాజీవ్ శుక్లా, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపి పాండవ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారని భావిస్తున్నారు. ఐపిఎల్ పదో ఎడిషన్ షెడ్యూలుకు సంబంధించిన చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని, కనుక ఈ సమావేశంలో కేవలం ఐపిఎల్ నిర్వహణకు సంబంధించిన అంశాలపై మాత్రమే దృష్టి సారించడం జరుగుతుందని బిసిసిఐ ఆఫీస్ బేరర్ ఒకరు సోమవారం పిటిఐ వార్తా సంస్థకు వివరించారు. లోధా కమిటీ సిఫారసుల అమలుపై సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పునకు విరుద్ధంగా ఈ సమావేశంలో ఎటువంటి చర్చలు జరగబోవని ఆయన స్పష్టం చేశారు.