క్రీడాభూమి

కంగారూలకు పెర్త్‌లోనే ‘ఎర్త్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, నవంబర్ 7: ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా పెర్త్‌లోని డబ్ల్యుఎసిఎ (వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్) మైదానంలో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా వర్థమాన పేస్ బౌలర్ కిగాసో రబాడా చక్కగా రాణించి 5 వికెట్లను కైవసం చేసుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 177 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఈ సిరీస్‌లో బోణీ చేసింది. 539 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు రబాడా ధాటికి తట్టుకోలేక 361 పరుగులకే చేతులెత్తేయడంతో కంగారూలకు సొంత గడ్డపై పరాభవం తప్పలేదు. 1988 నుంచి స్వదేశంలో జరిగిన ఒక్క మ్యాచ్‌లో కూడా ఆస్ట్రేలియా జట్టుకు ఓటమి ఎదురవలేదు. అయితే దక్షిణాఫ్రికా ప్రధాన పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ భుజానికి తగిలిన గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో అతని స్థానంలో బరిలోకి దిగిన రబాడా అద్భుతమైన ప్రదర్శనతో విజృంభించి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కైవసం చేసుకున్నాడు.
అంతకుముందు 4 వికెట్ల నష్టానికి 169 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టుకు నైట్ వాచ్‌మన్లు ఉస్మాన్ ఖ్వాజా, మిచెల్ మార్ష్ 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం మార్ష్ 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రబాడా బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా నిష్క్రమించడంతో వీరి భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత పీటర్ నెవిల్‌తో కలసి జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించిన ఖ్వాజా ఆరో వికెట్‌కు మరో 50 పరుగులు జోడించి 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జెపి.డుమినీ బౌలింగ్‌లో నిష్క్రమించగా, అతని స్థానంలో వచ్చిన మిచెల్ స్టార్క్ (13), పీటర్ సిడిల్ (13), జోష్ హాజెల్‌వుడ్ (29) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. చివర్లో నాథన్ లియోన్ (8)ను దక్షిణాఫ్రికా యువ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ లెగ్ బిఫోర్ రూపంలో పెవిలియన్‌కు చేర్చడంతో 361 పరుగులకు ఆలౌటైన ఆస్ట్రేలియా జట్టు చాలా కాలం తర్వాత సొంత గడ్డపై 177 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. అప్పటికి ఆసీస్ వికెట్ కీపర్ పీటర్ నెవిల్ 60 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు 242 పరుగులకే ఆలౌటైనప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 540 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 244 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూలై-ఆగస్టు నెలల్లో శ్రీలంక పర్యటన సందర్భంగా మూడు టెస్టుల్లోనూ ఓటమిపాలై ‘వైట్ వాష్’ వేయించుకున్న కంగారూలకు ఇది వరుసగా నాలుగో ఓటమి.

చిత్రం.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కిగాసో రబాడా (5/92)