క్రీడాభూమి

విశాఖ టెస్ట్ మ్యాచ్ ఏర్పాట్లపై తొలిసారి సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 7: విశాఖలో తొలిసారిగా నిర్వహించే క్రికెట్ టెస్ట్ మ్యాచ్‌ను అద్వితీయమైన రీతిలో నిర్వహించాలని ఆంధ్రా క్రికెట్ సంఘం తీర్మానించింది. భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ నెల 17 నుంచి జరిగే సిరీస్‌లోని రెండవ టెస్ట్‌మ్యాచ్‌కు వరకు ఏసిఏ-విడిసిఏ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ నిర్వాహక కమిటీ తొలి సమావేశాన్ని ఇక్కడి గ్రాండ్‌బే హోటల్‌లో సోమవారం నిర్వహించింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షులు డివివిఎస్ సోమయాజులు మాట్లాడుతూ మొదటిసారిగా నిర్వహిస్తున్న టెస్ట్ మ్యాచ్‌ను ఎప్పటికీ గుర్తు ఉండేలా విజయవంతంగా నిర్వహించడానికి కమిటీ సభ్యులంతా కృషి చేయాలని కోరారు. ఈ మ్యాచ్ విశాఖలో నిర్వహించడానికి ఏసిఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ఆంధ్రా క్రికెట్ సంఘం కార్యదర్శి గంగరాజు మాట్లాడుతూ ఈ టెస్ట్ మ్యాచ్‌ను ఎప్పటికీ మరిచిపోలేని విధంగా ప్రారంభవేడుకను ఘనంగా జరపాలని నిర్ణయించామని, మ్యాచ్‌కు ముందు రెండు జట్ల క్రికెటర్లను, ఆంధ్రా రంజీ ఆటగాళ్ళను జాతీయ జట్టుకు ఆడిన ఆంధ్రా క్రికెటర్లను సన్మానించనున్నట్టు ఆయన చెప్పారు. పోలీసు కమిషనర్ యోగానంద్ మాట్లాడుతూ స్టేడియంలోపల స్టాండ్స్‌ను, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, భారత్-ఇంగ్లండ్ క్రికెటర్లకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. సమావేశంలో ఏసిఏ ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు, డిజిజెజె రాజు, సంయుక్త కార్యదర్శి అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న
ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడు డివిఎస్ సోమయాజులు