క్రీడాభూమి

ఐపిఎల్ ఆటగాళ్ల వేలం వచ్చే నెలలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) పదో ఎడిషన్ క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించి వచ్చే నెల బెంగళూరులో ఆటగాళ్ల వేలాన్ని నిర్వహించనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న 10 సంవత్సరాల కాంట్రాక్టులో ఇదే చిట్టచివరి ఎడిషన్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీల వర్క్‌షాపును దుబాయ్‌లో నిర్వహించాలని మంగళవారం ఇక్కడ జరిగిన ఐపిఎల్ పాలక మండలి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే, ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, జార్ఖండ్, పంజాబ్ క్రికెట్ సంఘాల అధ్యక్షులు అమితాబ్ చౌదరి, ఎంపి పాండవ్ హాజరయ్యారు. పదో ఎడిషన్ ఐపిఎల్ టోర్నీలో మ్యాచ్‌లను నిర్వహించేందుకు మహారాష్టల్రోని ముంబయి, పుణె, నాగ్‌పూర్ కేంద్రాలను అనుమతించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.