క్రీడాభూమి

డిసెంబర్ 17న ఢిల్లీలో విజేందర్ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: భారత బాక్సింగ్ స్టార్ విజేందర్ సింగ్ తన డబ్ల్యుఓ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు డిసెంబర్ 17న ఇక్కడ పోటీ పడనున్నాడు. అయితే అతని ప్రత్యర్థి ఎవరనేది ఆ తర్వాత నిర్ణయిస్తారు. న్యూఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో డిసెంబర్ 17న విజేందర్ సింగ్ తన డబ్ల్యుబిఓ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు పోటీ పడతాడని భారత్‌లో విజేందర్ ప్రమోటర్ అయిన ఇన్‌ఫినిటీ ఆప్టిమల్ సొల్యూషన్స్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ పోటీలోనే మన దేశానికి చెందిన కొంతమంది ప్రముఖ బాక్సర్లు ప్రోబాక్సింగ్ రంగంలోకి తొలిసారిగా అడుగుబెట్టనున్నారు. ఈ బాక్సర్ల పేర్లు, వారి ప్రత్యర్థుల పేర్లను త్వరలోనే వెల్లడిస్తారు. ఇప్పటివరకు హర్యానాకు చెందిన విజేందర్ పోటీ పడిన 7 పోటీల్లోను విజయం సాధించగా, వాటిలో ఆరు నాకౌట్ విజయాలున్నాయి. కాగా, రాబోయే పోటీ కోసం తాను గత రెండు నెలలుగా బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో కఠినంగా శిక్షణ తీసుకుంటున్నానని ఈ రాబోయే పోటీ గురించి వ్యాఖ్యానిస్తూ విజేందర్ చెప్పాడు.