క్రీడాభూమి

హెవీవెయిట్ బాక్సింగ్ కొత్త చాంప్ ఫ్యూరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్, నవంబర్ 29: ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్‌లో కొత్త చాంపియన్ అవతరించాడు. 11 సంవత్సరాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న వ్లాదిమీర్ క్లిచ్కో దూకుడుకు అడ్డుకట్ట వేసిన 27 ఏళ్ల టైసన్ ఫ్యూరీ ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. 115-112, 115-112, 116-111 పాయింట్ల తేడాతో గెలిచిన అతనికి డబ్ల్యుబిఎ, ఐబిఎఫ్, ఐబిఓ, డబ్ల్యుబివో చాంపియన్‌షిప్ టైటిళ్లును క్లిచ్కో నుంచి స్వీకరించాడు. 2004 తర్వాత క్లిచ్కోకు ఇదే మొదటి పరాజయం కావడం గమనార్హం. వాస్తవానికి ఈ ఫైట్ గత నెల జరగాల్సి ఉండింది. అయితే, కండరాలు బెణకడంతో క్లిచ్కో ఫిట్‌గా లేకపోవడంతో ఫైట్‌ను వాయిదా వేశారు. టైటిల్ పోరుకు ఇరువురు బాక్సర్లు బాక్సింగ్ రింగ్‌లో సిద్ధమైన మరుక్షణమే స్టేడియంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 39 ఏళ్ల క్లిచ్కోను ఫ్యూరీ ఓడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశే్లషకులు అభిప్రాయపడినప్పటికీ, గత రికార్డులను పరిశీలిస్తే పోటీ తీవ్రంగా ఉంటుందన్న వాదన వినిపించింది. దశాబ్దానికిపైగా పరాజయం అన్నదే లేకుండా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న క్లిచ్కో ఓడించడం అనుకున్నంత సులభం కాదని అభిమానులు అంచనా వేశారు. అయితే, ఫైట్ మొదలైన వెంటనే క్లిచ్కోపై విరుచుకుపడిన ఫ్యూరీ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ పంచ్‌లతో అదరగొట్టాడు. క్లిచ్కో తన అపారమైన అనుభవంతో పంచ్‌ల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. తలకు బలమైన దెబ్బతగిలి రక్తం కారుతున్నప్పటికీ అతను పోరాటాన్ని కొనసాగించడం అభిమానులను ఆకట్టుకుంది. 6 అడుగుల 5 అంగుళాల పొడవుతో బలంగా ఉండే క్లిచ్కో కంటే సుమారు మూడు అంగుళాలు ఎక్కువ ఎత్తుగల ఫ్యూరీ తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. చిరస్మరణీయ విజయాన్ని సాధించాడు.