క్రీడాభూమి

తుది జట్టులో రాహుల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 15: యువ బ్యాట్స్‌మన్ లోకేష్ రాహుల్ ఇంగ్లాండ్‌తో గురువారం ఇక్కడ ప్రారంభం కానున్న రెండో టెస్టు ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉంటాడా? జట్టులోకి రాహుల్‌ను ప్రత్యేకించి అందుకే తీసుకున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెప్పాలి. టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే మంగళవారం విలేఖరుల సమావేశంలో ఈ విషయాన్ని చెప్పకనే చెప్పాడు. గాయం కారణంగా ఆటకు దూరమైన రాహుల్ పూర్తి ఫిట్నెస్‌తో ఉన్నాడని, అతనిని రెండో టెస్టుకు ఎంపిక చేసిన జట్టులోకి తీసుకుంటున్నామని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి అజయ్ షిర్కే ఒక ప్రకటనలో తెలిపాడు. కండరాలు బెణకడంతో విశ్రాంతి తీసుకున్న తర్వాత అతను ప్రస్తుతం రాజస్థాన్‌లో జరుగుతున్న రంజీ ట్రోఫీలో కర్నాటక తరఫున ఆడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 85 బంతుల్లో 76, రెండో ఇన్నింగ్స్‌లో 132 బంతుల్లో 106 చొప్పున పరుగులు చేసి ఫిట్నెస్‌తోపాటు ఫామ్‌ను కూడా నిరూపించుకున్నాడు. సెలక్టర్లను ఆకర్షించి జట్టులోకి వచ్చాడు.
అందుకే తీసుకున్నాం: కుంబ్లే
గాయం నుంచి కోలుకున్న రాహుల్ ఫామ్‌లో ఉన్నాడని, ఇంగ్లాండ్‌తో జరిగే రెండో టెస్టులో ఆతను ఆడాలని తాను కోరుకుంటున్నానని టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే అన్నాడు. ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉండాలన్న ఉద్దేశంతోనే అతనిని జట్టులోకి తీసుకున్నామని వ్యాఖ్యానించాడు. సుమారు రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన గౌతం గంభీర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో, రాహుల్‌ను పిలిపించారన్న వాదన వినిపించింది. దీనిపై కుంబ్లే దాదాపుగా స్పష్టతనిచ్చాడు. టెస్టు ప్రారంభం కావడానికి మరో రెండు రోజుల సమయం ఉంది కాబట్టి, అతను రంజీ మ్యాచ్‌లో తన పాత్రను పూర్తి చేసుకొని, జట్టుకు అందుబాటులో ఉంటాడని చెప్పాడు. కండరాలు బెణికిన కారణంగా న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు, వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌లకు రాహుల్ దూరమైన విషయాన్ని కుంబ్లే గుర్తుచేశాడు.
ఏ ఒక్కరిపైనో దృష్టి పెట్టం..
ఇంగ్లాండ్ జట్టులో జేమ్స్ ఆండర్సన్‌కు ప్లేయింగ్ ఎలెవెన్‌లో స్థానం లభిస్తుందా అన్న ప్రశ్నపై స్పుందిస్తూ, టీమిండియా ఏ ఒక్క వ్యక్తిపైనో దృష్టి కేంద్రీకరించడం లేదని స్పష్టం చేశాడు. ఆండర్సన్ ఖాతాలో 450కి మించి (463) టెస్టు వికెట్లు ఉన్నాయని, అతని అనుభవాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని కుంబ్లే అన్నాడు. అయితే, క్రికెట్ మ్యాచ్‌లు ఒకరిద్దరి ప్రతిభపై ఆధారపడవని వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్ సిరీస్‌తోపాటు, ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్లు ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ అద్భుత ప్రతిభ కనబరిచారని ప్రశంసించాడు. రివర్స్ స్వింగ్‌తో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారని అన్నాడు.
ఫీల్డింగ్‌లో భారత్ వైఫల్యాలను విలేఖరులు ప్రస్తావించినప్పుడు కుంబ్లే ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఫీల్డింగ్ విభాగాన్ని తీసుకుంటే, కేవలం క్యాచ్‌లు పట్టడంలోనే విఫలమయ్యామని అన్నాడు. వాస్తవాన్నికి బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో టీమిండియా అద్వితీయ ప్రతిభ కనబరచిందని ప్రశంసించాడు. అయితే, కొన్ని క్యాచ్‌లను విడిచేయడం వల్ల ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని కొనసాగించలేకపోయామని చెప్పాడు. ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన మొదటి టెస్టులో భారత ఫీల్డర్లు ఆరు క్యాచ్‌లు విడిచిపెట్టడాన్ని కుంబ్లే తమ వైఫల్యంగానే అభివర్ణించాడు. కానీ దానికి ప్రాధాన్యం ఇవ్వలేదు.

చిత్రం.. లోకేష్ రాహుల్