క్రీడాభూమి

చైనా బాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్ అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫజూ (చైనా), నవంబర్ 16: ఇక్కడ ప్రారంభమైన చైనా సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నీ మొదటి రౌండ్‌లోనే భారత స్టార్ సైనా నెహ్వాల్ పరాజయం పాలైంది. ఇటీవలే మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆమె కోలుకున్న తర్వాత తొలి టోర్నీలో పాల్గొని, చేదు అనుభవాన్ని చవిచూసింది. థాయిలాండ్‌కు చెందిన పోర్న్‌టిప్ బురనప్రసెట్సుక్ 21-16, 19-21, 21-14 తేడాతో సైనాను ఓడించింది. విజయం కోసం హైదరాబాదీ సైనా చేసిన పోరాటం ఫలించలేదు. కాగా, వచ్చేవారం జరిగే హాంకాంగ్ సూపర్ సిరీస్‌లో సైనా ఆడుతుంది.
రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, ఏడో సీడ్ పివి సింధు మొదటి రండ్‌లో చైనీస్ తైపీ క్రీడాకారిణి చియా సిన్ లీని 21-12, 21-16 తేడాతో ఓడించి శుభారంభం చేసింది. ఈ మ్యాచ్ కేవలం 34 నిమిషాల్లో ముగియడం విశేషం. పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్, హెచ్‌ఎస్ ప్రణయ్ రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. జయరామ్ తొలి రౌండ్‌లో 21-19, 29-22, 21-17 స్కోరుతో, అతి కష్టం మీద జూ సియువాన్ (చైనా)పై గెలిచాడు. ప్రణయ్ 21-13, 21-13 తేడాతో ఎంగ్ క లాంగ్ ఆగ్నస్ (హాంకాంగ్)ను ఓడించి ముందంజ వేశాడు.