క్రీడాభూమి

అమ్మాయిలు తిప్పేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 16: భారత్, వెస్టిండీస్ మహిళల జట్ల మధ్య జరిగిన వనే్డ క్రికెట్ సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. బుధవారం నాటి చివరి, మూడో వనే్డలో వేదా కృష్ణమూర్తి బ్యాటింగ్‌లో, రాజేశ్వరీ గైక్వాడ్ బౌలింగ్‌లో రాణించడంతో భారత్ 15 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. నగరానికి సమీపంలోని మూలపాడులో క్రికెట్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై అన్ని విభాగాల్లో భారత మహిళలు ఆధిక్యం ప్రదర్శించించారు. ఓపెనర్ స్మృతి మందానా 5 పరుగులకు పెవిలియన్‌కు చేరిన వెనువెంటనే కెప్టెన్ మిథాలీరాజ్ 15 పరుగులకు ఔట్ కావటంతో ఒక దశలో భారత్ కష్టాల్లో పడింది. అయతే, వేదా కృష్ణమూర్తి తనదైన శైలిలో బ్యాట్‌కు పనిచెప్పి 79 బంతుల్లో 10 ఫోర్లతో 71 పరుగులు చేసి జట్టు స్కోర్‌ను ముందుకు నడిపింది. కెరీర్‌లో మొదటి వనే్డ ఆడిన దేవిక 45 బంతుల్లో 3 ఫోర్లతో 32 పరుగులు చేసి వేదాతో కలిసితో జట్టు స్కోరు 199 పరుగులుగా నమోదు కావడానికి దోహదపడింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు భారత్‌ను మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత మహిళా జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 199 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో దీప్తిశర్మ 23, స్మృతి మందానా 5, మిథాలీరాజ్ 15, హర్మన్‌ప్రీత్‌కౌర్ 19 , వేదాకృష్ణమూర్తి 71, దేవిక వైద్య 32 (నాటౌట్), ఝూలన్ గోస్వామి 18, సుష్మ వర్మ 4 (నాటౌట్‌గా) చొప్పున పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో నేషన్ 2 వికెట్లు తీయగా షకీరా సెల్మాన్, దియేంద్ర డాటిన్, అనిసా మహ్మద్, స్ట్ఫోనీ టేలర్‌కు తలా ఓ వికెట్ లభించింది.
అనంతరం, 200 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ను లక్ష్యానికి చేరకుండా భారత బౌలర్ రాజేశ్వరీ గైక్వాడ్ అడ్డుకుంది. ఆమె 4 వికెట్లు తీసి విండీస్ వెన్ను విరిచింది. ఫలితంగా ఆ జట్టు 49.1 ఓవర్లలో 184 పరుగులకు అలౌటై, వైట్‌వాష్ వేయంచుకుంది. విండీస్ బ్యాట్స్‌విమన్‌లో హీలీ మాథ్యూస్ 53 బంతుల్లో 9 ఫోర్లతో 44, షాక్వానా క్వాన్‌టైన్ 43 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్‌తో 18, కెప్టెన్ స్ట్ఫోనీ టేలర్ 27 బంతుల్లో 2 ఫోర్లతో 14, క్యాసినా నైట్ 94 బంతుల్లో 5 ఫోర్లతో 55, డాటిన్ 30 బంతుల్లో ఒక సిక్స్‌తో 14, వికెట్ కీపర్ మెరిసా ఆక్విలెరియా 26 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 22 చొప్పున పరుగులు చేసి ఒక దశలో భారత్‌కు వణుకుపుట్టించారు. అయతే, రాజేశ్వరీ గైక్వాడ్ 10 ఓవర్లలో 34 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి విండీస్‌ను దెబ్బతీసింది. దీప్తిశర్మ 9.1 ఓవర్లలో 27 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించింది. హర్మన్‌ప్రీత్‌కౌర్ 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి ఒకటి, దేవిక వైద్య 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి ఒకటి చొప్పున వికెట్లు తీశారు. ఎక్తా బిస్త్ 10 ఓవర్లలో 34 పరుగులు, ఫేసర్ జులాన్ గోస్వామి 7 ఓవర్లలో 38 పరుగులు, పరిదా 5 ఓవర్లలో 14 పరుగులిచ్చినప్పటికీ వికెట్లు సాధించలేకపోయారు.
సిరీస్ విజయం సులభమేం కాదు: మిథాలీ
వనే్డ సిరీస్‌లో విండీస్‌ను క్లీన్‌స్వీప్ చేసినంత మాత్రాన శుక్రవారం నుండి జరుగనున్న టి-20 సిరీస్‌లో విజయం అనుకున్నంత సులువు కాదని భారత కెప్టెన్ మిథాలీరాజ్ అన్నది. వనే్డ సిరీస్ గెలిచిన అనంతరం ఆమె మాట్లాడుతూ విండీస్ ప్రస్తుత టి-20 చాంపియన్ అని గుర్తు చేసింది. కాగా, టి-20 ఫార్మాట్‌లో భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుంది.

వెస్టిండీస్‌పై వనే్డ సిరీస్‌ను 3-0 తేడాతో గెల్చుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు