క్రీడాభూమి

భారత స్పిన్నర్లకు భయపడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(స్పోర్ట్స్), నవంబర్ 16: విశాఖలోని పిచ్ స్పిన్నర్లకు అనుకూలించినా, లేకపోయినా భయపడేది లేదని, ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ ఆలస్టర్ కుక్ పేర్కొన్నాడు. బ్యాటింగ్‌లో 80 పరుగులకే ఆలౌటైతే, ప్రత్యర్థిని కూడా 80 పరుగుల లోపే అవుట్ చేసేందుకు ప్రయత్నిస్తామని, రేపటి మ్యాచ్‌కు మా జట్టు సిద్ధంగా ఉందన్నాడు. పిచ్ రిపోర్టులు తాను చదివానని, ఐతే ఈ మ్యాచ్‌పై ఎంత ప్రభావం చూపుతుందన్నది ప్రశ్నార్థకమని అన్నాడు. రాజ్‌కోట్‌లో భారత జట్టు ఓటమి అంచులకు చేరుకుందని, కోహ్లీ, జడేజా వికెట్‌లను కాపాడుకుంటూ ఆడటంతో మ్యాచ్ డ్రాగా ముగిసిందని గుర్తు చేశాడు. ఇంగ్లాండ్ జట్టు స్పిన్నర్లు భారత్ బ్యాట్స్‌మెన్‌లను రాజ్‌కోట్‌లో ఇబ్బందికి గురిచేసిన సంగతి మర్చిపోవద్దన్నాడు. అదే గేమ్ ప్లాన్‌తో ఇక్కడ కూడా ఆడుతామని, బంగ్లాదేశ్‌లో జరిగిన సిరీస్‌లో ఓటమి తరువాత, జట్టు మరింత రాటుతేలిందని, ఆ మ్యాచ్‌లో ఓటమితో జట్టు స్పిన్నర్లను తక్కువగా అంచనా వేయట్లేదని పేర్కొన్నాడు. ప్రతి మ్యాచ్‌లో తమ లోపాలను సరిదిద్దుకుని రాణించేందుకు ప్రయత్నిస్తామన్నాడు. బ్యాట్స్‌మెన్ తొలి 30 బంతులను అర్థం చేసుకోగలిగితే ఆ తరువాత ఎదురుండదని అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్‌కు ముందు ముంబైలో జరిగిన ప్రీ సిరీస్ కేంప్ ఎంతో ఉపకరించిందని, ఇక్కడి పరిస్థితులను, వాతావరణాన్ని అవగతం చేసుకునేందుకు అవకాశం చిక్కిందని కుక్ తెలిపాడు. ఈ సిరీస్ కోసం బ్యాటింగ్‌లో ఎక్కువగా సాధన చేశామని వివరించాడు.

భారత్, ఇంగ్లాండ్ జట్ల సాధన

విశాఖపట్నం(స్పోర్ట్స్), నవంబర్ 16: భారత్-ఇంగ్లాండ్ జట్ల ఆటగాళ్లు బుధవారం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. భారత్ జట్టు ఉదయం 9 గంటలకు స్టేడియానికి చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించింది. తొలిరోజు కేవలం ఫిట్‌నెస్, రిక్రియేషన్ గేమ్‌కే పరిమితమైన కోహ్లీ సేన బుధవారం మాత్రం పూర్తిగా ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్‌పై ఎక్కువ సేపు సాధన చేశారు. నెట్‌లో బ్యాట్స్‌మెన్‌లు బలంగా సిక్సర్లు కొట్టేందుకు యత్నించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు స్టేడియంకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు ఫిట్నెస్, బౌలింగ్, ఫీల్డింగ్‌పై ఎక్కువగాశ్రమించింది.