క్రీడాభూమి

ప్రత్యర్థిపై ఒత్తిడి తెస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 16: కెఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని, మురళీ విజయ్‌తో ఓపెర్‌గా దిగే అవకాశంలో రాహుల్‌కే ప్రాధాన్యం ఇస్తామని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. విశాఖ ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో బుధవారం ప్రాక్టీస్ అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో కోహ్లీ మాట్లాడాడు. రాజస్థాన్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో రాణించిన రాహుల్ ఫిట్నెస్ నిరూపించుకుని జట్టులో చేరాడని, ఈ సిరీస్‌లో జరిగే మిగతా మ్యాచ్‌లో గంభీర్ స్థానంలో రాహుల్ ఓపెనర్‌గా కొనసాగుతాడని చెప్పాడు. రెండేళ్ల విరామం అనంతరం టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న గంభీర్‌కు ప్రత్యామ్నాయం రాహుల్ మాత్రమేనని అభిప్రాయపడ్డాడు. రాహుల్ ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఏ స్థానంలోనైనా రాణించే మంచి క్రికెటర్ అని కొనియాడాడు. జట్టులో రాహుల్ చేరిక సంతోషంగా ఉందని, అతను ఏలాంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా చక్కగా ఆడగల సత్తా ఉన్నవాడని ప్రశంసించాడు. విశాఖలో ఇదే పిచ్‌పై ఇటీవల జరిగిన వనే్డలో న్యూజిలాండ్ జట్టును కేవలం 23.1 ఓవర్‌లో 79 పరుగులకే కుప్పకూల్చడం జట్టులో ఆత్మస్థైర్యాన్ని పెంచిందని, హోం గ్రౌండ్‌లో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై మన బౌలర్లు చెలరేగడం ఖాయమని చెప్పాడు. ముఖ్యంగా విశాఖ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని, ప్రారంభంలో సీమర్లకు కూడా వికెట్ సహకరిస్తుందని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో స్మిన్నర్లదే ప్రముఖ పాత్రని, రాజ్‌కోట్ పిచ్‌పై ఎక్కువ గడ్డి ఉండటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నాడు. జట్టు బలం, బలహీనతలపైన దృష్టి సారిస్తామని, కలిసికట్టుగా ఆడి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలన్నది తమ వ్యూహమని కోహ్లీ తెలిపాడు. కొంత కాలంగా జట్టు అద్భుతంగా రాణిస్తోందని, హోం గ్రౌండ్‌లో ఆడుతున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నాడు.
నోట్ల రద్దు గొప్ప నిర్ణయం..
దేశంలో రూ.500, రూ.1000 నోట్ల రద్దు సాహసోపేత నిర్ణయమని విరాట్ కోహ్లీ అన్నాడు. రాజకీయంగా మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిపాడు. దీనిని ఎవరూ ఊహించలేదన్నాడు. దేశానికి ఈ చర్య ఎంతో మేలుచేస్తుందని అభిప్రాయపడ్డాడు. తన వద్దనున్న పెద్ద నోట్లపై ఆటోగ్రాఫ్ చేసి పంచుతానని కోహ్లీ పేర్కొన్నాడు.
chitram...
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ