క్రీడాభూమి

స్ప్రింటర్ ధరమ్‌వీర్‌పై సస్పెన్షన్ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: హర్యానాకు చెందిన స్ప్రింటర్ ధరమ్‌వీర్ సింగ్‌పై ఎనిమిదేళ్ల సస్పెన్షన్ వేటు పడింది. రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హత సంపాదించినప్పటికీ, డోప్ టెస్టులో విఫలమైన కారణంగా చివరి క్షణాల్లో అతని ప్రయాణం రద్దయింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్టు జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (నాడా) అప్పట్లో ప్రకటించింది. కాగా, ‘బి’ శాంపిల్స్‌ను పరీక్షించిన తర్వాత, ధరమ్‌వీర్ నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించినట్టు ధ్రువీకరించింది. అతను ఎనిమిదేళ్ల పాటు ఏ స్థాయి పోటీల్లోనూ పాల్గొనడానికి వీల్లేదని పేర్కొంది. ఈ ఏడాది జూలై 11న బెంగళూరులో జరిగిన భారత గ్రాండ్ ప్రీలో పాల్గొన్నప్పుడు సేకరించిన శాంపిల్స్‌లో ధరమ్‌వీర్ దోషిగా తేలాడు.