క్రీడాభూమి

కివీస్, పాక్ తొలి టెస్టు మొదటి రోజు ఆట రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చి, నవంబర్ 17: న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట వర్షం కారణంగా రద్దయింది. కుంభ వృష్టి కురవడంతో ఫీల్డ్ అంపైర్లు టీ విరామం వరకూ వేచి చూశారు. అప్పటికీ జల్లులు పడుతునే ఉండడంతో, మొదటి రోజు ఆట రద్దయినట్టు ప్రకటించారు. శుక్రవారం నాటి ఆట నిర్ణీత సమయానికి ఒక అరగంట ముందుగా మొదలవుతుందని తెలిపారు. ఇటీవలే వెస్టిండీస్‌ను చిత్తుచేసిన పాకిస్తాన్ అదే ఆత్మవిశ్వాసంతో ఉండగా, భారత్ చేతిలో వైట్‌వాష్ వేయించుకున్న కివీస్ మళ్లీ ఫామ్‌లోకి రావాలన్న పట్టుదలతో మ్యాచ్‌కి సిద్ధమైంది.