క్రీడాభూమి

ధోనిని వేధిస్తున్న స్పిన్నర్ల వైఫల్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్, జనవరి 13: ఇటీవల దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన స్టార్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మంగళవారం ఆసీస్‌తో జరిగిన మొదటి వనే్డలో విఫలం కావడం టీమిండియా కెప్టెన్‌ను వేధిస్తున్నట్టు సమాచారం. స్వదేశంలో చెలరేగిపోయే వీరిద్దరూ విదేశాల్లో ఎందుకు విఫలమవుతున్నారో అర్థంగాక ధోనీ ఆందోళన పడుతున్నాడు. ఆస్ట్రేలియా పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయన్నది వాస్తవం. అయితే, బిషన్ సింగ్ బేడీ, ఎర్రాపల్లి ప్రసన్న, భగవత్ చంద్రశేఖర్, అనీల్ కుంబ్లే వంటి స్పిన్నర్లు పిచ్ స్వభావంతో సంబంధం లేకుండా చక్కటి ప్రతిభాపాటవాలను కనబరిచేవారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. భారత స్పిన్నర్లు స్వదేశంలో విజృంభించడం, విదేశాల్లో చతికిలబడడం ఆనవాయితీగా మారింది. కెరీర్‌లో తొలి టెస్టు ఆడిన ఫాస్ట్ బౌలర్ బరీందర్ శరణ్ మూడు వికెట్లు పడగొట్టిన నేపథ్యంలో, సహజంగానే అశ్విన్, జడేజా నుంచి అభిమానులు మెరుగైన ఫలితాలను కోరుకుంటారు. కానీ వారి వైఫల్యాలు కెప్టెన్ ధోనీని ఆందోళనకు గురి చేస్తున్నాయి. మిగతా నాలుగు వనే్డల్లోనూ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ఏం చేయాలన్న ప్రశ్నకు సమాధానం దొరక్క మల్లగుల్లాలు పడుతున్నాడు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు అన్న సూత్రాన్ని పక్కకుపెట్టి, నలుగురు లేదా ఐదుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలన్న ఆలోచన కూడా అతనికి ఉందని అంటున్నారు. అయితే, మొదటి మ్యాచ్ ఫలితంతోనే కఠిన నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
జట్టు విజయమే ముఖ్యం: రోహిత్ శర్మ
జట్టు విజయం సాధించడం కంటే మరే విషయం కూడా ఆనందం ఇవ్వదని, ఓటమిని ఎదుర్కొన్నప్పుడు శతకం చేశామన్న సంతృప్తి కూడా ఉండదని భారత ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. బిసిసిఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వనే్డలో అజేయంగా 171 పరుగులు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ ఇన్నింగ్స్ తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నాడు. అయితే, జట్టు ఓడిపోవడంతో నిరాశ చెందానని అన్నాడు. సెంచరీ లేదా ఏదైనా మైలురాయి వ్యక్తిగతంగా సంతోషాన్నిచ్చే అంశాలేనని అన్నాడు. కానీ, జట్టు విజయం కంటే అవి ముఖ్యం కాదని స్పష్టం చేశాడు. మొదటి వనే్డలో ఓడినప్పటికీ జట్టులో ఆత్మవిశ్వాసం తగ్గలేదని అన్నాడు. తర్వాతి మ్యాచ్‌ల్లో ఎదురుదాడికి దిగుతామని చెప్పాడు. జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని, మిగతా మ్యాచ్‌ల్లో విజయానికి కృషి చేస్తామని తెలిపాడు.