క్రీడాభూమి

భారత్‌కు గట్టిపోటీ: కుక్ ధీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్ ట్యాంపరింగ్‌పై స్పష్టతనివ్వాలని ఐసిసిని కుక్ కోరాడు. రాజ్‌కోట్‌లో జరిగిన మొదటి టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు బ్రిటిష్ మీడియాలో వచ్చిన వార్తలపై అతను స్పందిస్తూ, ఈ విషయంలో మరింత స్పష్టమైన దిశానిర్దేశనం చేయాల్సిన అవసరం ఉందని ఐసిసికి సూచించాడు.

మొహాలీ, నవంబర్ 25: రెండో టెస్టులో ఓడినప్పటికీ, మొహాలీ టెస్టులో భారత్‌కు గట్టిపోటీనిస్తామని ఇంగ్లాండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ ధీమా వ్యక్తం చేశాడు. శుక్రవారం అతను విలేఖరులతో మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లో తాము ‘అండర్ డాగ్’ ముద్రతో మైదానంలోకి దిగుతున్నామన్నది వాస్తవమని అన్నాడు. అయితే, ప్రతి క్షణం పోరాటం సాగిస్తామని చెప్పాడు. ఒక మ్యాచ్ వెనుకంజలో ఉన్న నేపథ్యంలో, ప్రపంచ నంబర్ వన్ జట్టును ఎదుర్కోవడం, అందులోనూ వారి సొంత గడ్డపై ఢీకొనడం ఆషామాషీ వ్యవహారం కాదని అంగీకరించాడు. టీమిండియా బలాన్ని తక్కువ అంచనా వేయడం లేదని, కానీ, సవాళ్లను విసిరే సత్తా తమకు ఉందని చెప్పాడు. సుమారు ఏడాది కాలంగా ఇంగ్లాండ్ జట్టు బలాన్ని పుంజుకుంటున్నదని, ఉన్నత ప్రమాణాలతో రాణిస్తున్నదని కుక్ అన్నాడు. గత ఏడాది దక్షిణాఫ్రికాకు వెళ్లి, అప్పట్లో టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న ఆ జట్టును ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకున్నామని గుర్తుచేశాడు. టీమిండియాతో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌ను అప్పటి దక్షిణాఫ్రికాతో జరిగిన పోరుతో పోల్చలేమని కుక్ అన్నాడు. జాతీయ జట్టులోకి వచ్చేందుకు చాలా మంది యువ ఆటగాళ్లు పోటీపడుతున్నారంటూ, ఈ మార్పుల నేపథ్యంలో ఒడిదుడుకులు సహజమన్నాడు. భారత్ పర్యటనకు వచ్చే ముందు బంగ్లాదేశ్‌లో ఆడిన రెండు టెస్టుల సిరీస్ డ్రాగా ముగిసిన విషయం అందరికీ తెలిసిందేనని చెప్పాడు. ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో ఎదురైన పరాజయాన్ని పక్కకుపెట్టి, భారత్‌తో టెస్టుకు మళ్లీ సరికొత్తగా సిద్ధమయ్యామని అన్నాడు. 2012లో తాము భారత్‌లో పర్యటించినప్పుడు, అహ్మదాబాద్‌లో జరిగిన మొదటి టెస్టును కోల్పోయామని కుక్ అన్నాడు. ఆ మ్యాచ్ ముగిసిన వెంటనే తాను విలేఖరులతో మాట్లాడుతూ అన్న మాటలు ఇప్పటికీ గుర్తున్నాయని తెలిపాడు. ఆ సిరీస్‌ను భారత్ 4-0 తేడాతో గెల్చుకుంటుందని తాను జోస్యం చెప్పానని, కానీ, మిగతా మూడు టెస్టులను తమ ఖాతాలో వేసుకొని, తామే 3-1 ఆధిక్యంతో సిరీస్‌ను సాధించామని కుక్ వివరించాడు. క్రికెట్‌లో ఎప్పుడైనా.. ఏదైనా జరగవచ్చనడానికి ఇదే నిదర్శనమని ఇంగ్లాండ్ తరఫున ఎక్కువ టెస్టులు ఆడిన క్రికెటర్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కిన కుక్ అన్నాడు. అందుకే 0-1 తేడాతో వెనుకబడినప్పటికీ తమ ఆత్మవిశ్వాసం తగ్గలేదని వ్యాఖ్యానించాడు.