క్రీడాభూమి

2న బిసిసిఐ ప్రత్యేక సమావేశం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 28: సుప్రీం కోర్టుకు లోధా కమిటీ దాఖలు చేసిన స్టేటస్ రిపోర్ట్‌పై చర్చించడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం) డిసెంబర్ 2న జరిగే అవకాశాలున్నాయి. పేరు చెప్పడానికి ఇష్టపడని బోర్డుకు చెందిన ఒక అధికారి సోమవారం పిటిఐతో మాట్లాడుతూ లోధా కమిటీ స్టేటస్ రిపోర్ట్ తర్వాత తలెత్తిన పరిణామాలపై చర్చించనున్నట్టు తెలిపాడు. లోధా సిఫార్సులను అమలు చేస్తామని లిఖితపూర్వక హామీతో అఫిడవిట్‌ను దాఖలు చేసిన తర్వాతే సంబంధిత సభ్య సంఘాలకు చెల్లింపు జరపాలని బిసిసిఐని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అంతేగాక, వచ్చేనెలలోనే సిఫార్సుల అపలుపై స్పష్టతనివ్వాలని కూడా బోర్డుకు తెలిపింది. ఇలావుంటే, సిఫార్సుల అమలుతోపాటు, భారీ చెల్లింపులు తదితర అంశాలను కూడా లోధా కమిటీ తన స్టేటస్ రిపోర్టులో ప్రస్తావించింది. బోర్డు అధికారులు ఉద్దేశపూర్వకంగానే సిఫార్సుల అమలును వాయిదా వేస్తున్నారని ఆరోపించింది. ప్రస్తుత కమిటీని రద్దు చేసి, దాని స్థానంలో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. లోధా చేసిన సూచనలకు సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నందున, తదుపరి వ్యూహాలను ఖరారు చేసుకోవడానికి ఎస్‌జిఎంను నిర్వహించాలని బిసిసిఐ అధికారులు నిర్ణయించినట్టు సమాచారం.
ప్రపంచ స్నూకర్ క్వార్టర్స్‌కు అద్వానీ
దోహా, నవంబర్ 28: కెరీర్‌లో పదిహేను పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న భారత వీరుడు పంకజ్ అద్వానీ ఇక్కడ జరుగుతున్న ఐబిఎస్‌ఎఫ్ ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ పైనల్ చేరాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దగిన అతను బాబర్ మసీ (పాకిస్తాన్), కీన్ హూ మో (మలేసియా)లను ఓడించి క్వార్టర్స్‌లో స్థానం సంపాదించాడు.