క్రీడాభూమి

భారత్ జైత్రయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, నవంబర్ 29: ఆసియా కప్ మహిళల ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టికరిపించి ఈ టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టును భారత బౌలర్లు ఆరంభం నుంచే సమర్ధవంతంగా నిలువరించారు. ముఖ్యంగా ఏక్తా బిస్త్ (3/20), అంజూ పాటిల్ (2/12), హర్మన్‌ప్రీత్ కౌర్ (2/16) ప్రత్యర్థులపై నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. వీరి జోరును ప్రతిఘటించడంలో ఘోరంగా విఫలమైన పాకిస్తాన్ జట్టులో ఓపెనర్ అయేషా జఫర్ (28), నయిన్ అబిది (37-నాటౌట్), ఇరామ్ జావెద్ (10) మినహా ఎవరూ రెండంకెల స్కోర్లు సాధించలేకపోయారు. దీంతో పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 97 పరుగులు మాత్రమే రాబట్టింది.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుకు ఓపెనర్లు మిథాలీ రాజ్ (36), స్మృతి మందన (14) 27 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వీరి నిష్క్రమణ తర్వాత సబ్బినేని మేఘన (8), వేదా కృష్ణమూర్తి (2), ఝులన్ గోస్వామి (3) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగినప్పటికీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (26), అంజూ పాటిల్ (2) అజేయంగా నిలిచి మిగిలిన పని పూర్తి చేశారు. దీంతో 19.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 98 పరుగులు సాధించిన భారత జట్టు మరో 4 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభతో అలరించి భారత జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కైవసం చేసుకుంది.
సంక్షిప్తంగా స్కోర్లు
పాకిస్తాన్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 97/7 (అయేషా జఫర్ 28, నయన్ అబిది 37-నాటౌట్, ఇరామ్ జావెద్ 10, ఏక్తా బిస్త్ 3/20, అంజూ పాటిల్ 2/12, హర్మన్‌ప్రీత్ కౌర్ 2/16)
భారత్ ఇన్నింగ్స్: 19.2 ఓవర్లలో 98/5 (మిథాలీ రాజ్ 36, స్మృతి మందన 14, హర్మన్‌ప్రీత్ కౌర్ 26-నాటౌట్, నిదా దార్ 2/11, సదియా యూసఫ్ 2/27, సనా మిర్ 1/15)

చిత్రం..‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ హర్మన్‌ప్రీత్ కౌర్