క్రీడాభూమి

ఒక్క సెషన్‌లోనే 9 వికెట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్, నవంబర్ 29: పాకిస్తాన్‌తో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల క్రికెట్ సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. హామిల్టన్‌లో మంగళవారం ముగిసిన రెండవ, చివరి టెస్టులో న్యూజిలాండ్ బౌలర్లు అన్యూహ్య రీతిలో విజృంభించి చివరి సెషన్‌లోనే తొమ్మిది వికెట్లు కైవసం చేసుకున్నారు. దీంతో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు అత్యంత నాటకీయంగా 138 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను మట్టికరిపించి 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. పాక్‌పై న్యూజిలాండ్ సిరీస్‌ను గెలుచుకోవడం దాదాపు మూడు దశాబ్దాల (1985) తర్వాత ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో మొత్తం 8 (తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 2) వికెట్లు సాధించి న్యూజిలాండ్ విజయంలో కీలకపాత్ర పోషించిన టిమ్ సౌథీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కైవసం చేసుకున్నాడు.
అంతకుముందు 369 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టి సోమవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 1 పరుగు సాధించిన పాకిస్తాన్‌కు మంగళవారం ఓపెనర్ సమీ అస్లమ్, కెప్టెన్ అజర్ అలీ 131 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం అజర్ అలీ (58) మిఛెల్ సాంట్నర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా నిష్క్రమించడంతో టీ విరామ సమయానికి పాక్ 1 వికెట్‌ను మాత్రమే కోల్పోయి 158 పరుగులు సాధించింది. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగియం ఖాయమని అందరూ భావిస్తున్న తరుణంలో న్యూజిలాండ్ బౌలర్లు అనూహ్య రీతిలో విజృంభించారు. ముఖ్యంగా నీల్ వాగ్నర్ (3/57), మిచెల్ సాంట్నర్ (2/49), టిమ్ సౌథీ (2/60) నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వీరి జోరును ప్రతిఘటించడంలో ఘోరంగా విఫలమైన పాక్ జట్టులో బాబర్ ఆజమ్ (16), సమీ అస్లామ్ (91), సర్‌ఫ్రాజ్ అహ్మద్ (19), అసద్ షఫిక్ (0), యూనిస్ ఖాన్ (11), సొహైల్ ఖాన్ (8), మహమ్మద్ అమీర్ (0), వహాబ్ రియాజ్ (0), ఇమ్రాన్ ఖాన్ (0) వరుసగా పెవిలియన్‌కు పరుగెత్తారు. దీంతో కేవలం 72 పరుగుల వ్యవధిలో మిగిలిన 9 వికెట్లూ కోల్పోయి 230 పరుగులకు ఆలౌటైన పాకిస్తాన్ జట్టు 138 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగులు సాధించిన న్యూజిలాండ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 313 పరుగుల స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా, తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 216 పరుగులకు ఆలౌటైంది.

చిత్రం..టెస్టు సిరీస్ ట్రోఫీతో న్యూజిలాండ్ ఆటగాళ్ల సంబరాలు