క్రీడాభూమి

డబుల్ గోల్స్‌తో మెరిసిన యూసఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, నవంబర్ 29: ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో ప్రారంభమైన రెండు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భారత జట్టు శుభారంభాన్ని సాధించింది. మంగళవారం మెల్బోర్న్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 3-2 గోల్స్ తేడాతో ఆతిథ్య కంగారూలను మట్టికరిపించి ఈ సిరీస్‌లో బోణీ చేసింది. యువ స్ట్రైకర్ అఫ్ఫన్ యూసఫ్ అద్భుతమైన రెండు ఫీల్డ్ గోల్స్ సాధించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే విజృంభించి ఆడిన భారత జట్టుకు 19వ నిమిషంలో తొలి ఫీల్డ్ గోల్‌ను అందించిన అఫ్ఫన్ అదే నిమిషంలో మరో ఫీల్డ్ గోల్ సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు. దీంతో మ్యాచ్ ప్రథమార్థం ముగిసే సమయానికే 2-0 గోల్స్ తేడాతో తిరుగులేని ఆధిక్యత సాధించిన భారత జట్టు ద్వితీయార్థంలో రక్షణాత్మక ధోరణిని ప్రదర్శించింది. అయితే అప్పటికే తీవ్రమైన వత్తిడిలో కూరుకుపోవడంతో విజృంభించి ఆడిన ఆస్ట్రేలియా జట్టుకు 36వ నిమిషంలో మాథ్యూ విలియమ్స్ తొలి గోల్‌ను అందించగా, 43వ నిమిషంలో ట్రెంట్ మిట్టన్ ఈక్వలైజర్‌ను సాధించి కంగారూల శిబిరంలో ఆశలు చిగురింపజేశాడు. అయితే ఆ ఆశలు ఎంతోసేపు నిలవలేదు. 44వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను భారత డ్రాగ్‌ఫ్లికర్ విఆర్.రఘునాథ్ గోల్‌గా మలచి ఆసీస్ ఆశలను నీరుగార్చాడు. ఆ తర్వాత కంగారూలను సమర్థవంతంగా ప్రతిఘటించిన భారత జట్టు 3-2 గోల్స్ తేడాతో విజయం సాధించి ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యత సాధించింది. ఈ సిరీస్‌లో చివరిదైన రెండో మ్యాచ్ బుధవారం జరుగుతుంది.

చిత్రం..భారత యువ స్ట్రైకర్ అఫ్ఫన్ యూసఫ్