క్రీడాభూమి

ఆ ప్రశ్నలు.. ఏడాదిలోనే ‘టర్న్’ అయ్యాయి : కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, నవంబర్ 24: ఏడాది క్రితం వరకు అతిగా స్పందించే నాసిరకం పిచ్‌లపై ఆడడానికి మీరు ఎందుకు ఇష్టపడుతున్నారనే ప్రశ్నలు వినిపించేవని, అయితే ఇప్పుడు ఆ ప్రశ్నలు ‘టర్న్’ అయి మంచి పిచ్‌ల మీద కూడా ఎలా గెలవగలుగుతున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. దక్షిణాఫ్రికాపై సొంత గడ్డపై ఆడుతున్నప్పుడు టీమిండియాపై ఇలాంటి ప్రశ్నలు తలెత్తాయి. పూర్తిగా స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లనే ఎందుకు ఎంచుకుంటున్నారని అప్పుడు తనను చాలా మంది ప్రశ్నించారని కోహ్లీ అన్నాడు. అయితే విశాఖపట్నంలో ఇంగ్లండ్‌పై జరిగిన రెండో టెస్టులోను, మొహాలీలో జరిగిన మూడో టెస్టులోను భారత్ సాధించిన విజయాలు స్పిన్‌కు పెద్దగా సహకరించని పిచ్‌లపైనే సాధించినవేనని కోహ్లీ తెలిపాడు. అందువల్ల ఇప్పుడు పిచ్‌ల గురించి తాము పెద్దగా మాట్లాడవలసిన పని లేదని కోహ్లీ అంటూ, గతంలో వచ్చిన ప్రశ్నలను మాత్రం మరిచిపోలేమన్నాడు. తమది నాణ్యమైన క్రికెట్ ఆడే టీమ్ అని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నామని కోహ్లీ చెప్పాడు.