క్రీడాభూమి

తిరుగులేని కార్ల్‌సెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, డిసెంబర్ 1: చదరంగ ప్రపంచంలో నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సెన్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైబ్రేకర్‌లో బుధవారం అతను రష్యాకు చెందిన సెర్గీ కర్యాకిన్‌ను ఓడించి వరుసగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచాడు. దీంతో కార్ల్‌సెన్ చదరంగ ప్రపంచంలో 15 ఏళ్ల పాటు గుత్త్ధాపత్యాన్ని ప్రదర్శించిన రష్యన్ గ్రాండ్ మాస్టర్ గ్యారీ కాస్పరోవ్ లాంటి చెస్ లెజెండ్స్‌కు చేరువయ్యాడు. ఈ టోర్నీలోని 12 సాధారణ రౌండ్లలో ప్రత్యర్థికి తీవ్రమైన పోటీ ఇచ్చి అతనితో సరిసమానంగా నిలిచిన కర్యాకిన్ అందరి అంచనాలను పటాపంచలు చేసినప్పటికీ తుది దశలో జరిగిన నాలుగు ఎక్స్‌ట్రా గేముల్లో కార్ల్‌సెన్ అతడిని మట్టికరిపించి మరోసారి చాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. 2013లో తొలిసారి, 2014లో రెండోసారి భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న కార్ల్‌సెన్‌కు ఇది వరుసగా మూడో విజయం.