క్రీడాభూమి

కోహ్లీ అంకితభావం అసమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: శ్రీలంక మాజీ క్రికెటర్, ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్‌లలో ఒకరైన సనత్ జయసూర్య టీమిండియా కెప్టెన్ వారాట్ కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తాడు. కోహ్లీ ఒక గొప్ప క్రికెటర్‌గా ఎదిగిన తీరును, ఆట పట్ల అతని అంకిత భావాన్ని జయసూర్య ప్రశంసించాడు. ‘విరాట్ కోహ్లీ అంకితభావం కలిగిన క్రికెటర్. ప్రతి మ్యాచ్‌కి మందు అతను ఎంతో శ్రమించి ప్రాక్టీస్ చేయడమే కాక శిక్షణ పొందుతాడు. అతను ఎల్లప్పుడూ తన ఆటపై దృష్టిపెట్టి ఉంటాడు. ప్రతి క్రికెటర్‌కు కావలసింది అదే . మ్యాచ్‌కి ముందు అంతగా శ్రమించినప్పుడు రాణించడానికి గొప్ప అవకాశముంటుంది’ అని జయసూర్య అన్నట్లు ‘మిడ్‌డే’ పత్రిక తెలిపింది. శ్రీలంక తరఫున 110 టెస్టులు, 445 వన్‌డేలు ఆడిన జయసూర్య వన్‌డే క్రికెట్ తీరుతెన్నులనే మార్చివేసిన విషయం తెలిసిందే. ‘ఎ టాల్ ఆర్డర్’ పేరిట కపిల్ పథారే క్రికెట్‌పై రాసిన పుస్తకం ప్రచారం కోసం జయసూర్య ప్రస్తుతం భారత్ వచ్చాడు.
ఆల్‌రౌండర్ కూడా అయిన జయసూర్య టీమిండియా ఫ్రంట్‌లైన్ బౌలర్, ఆల్‌రౌండర్ కూడా అయిన రవిచంద్రన్ అశ్విన్‌ను సైతం ప్రశంసలతో ముంచెత్తాడు. ఆఫ్ స్పిన్నర్‌గా అశ్విన్ ఎంతోపురోగతి సాధించాడు. బ్యాట్స్‌మన్‌గా కూడా అతను చక్కగా రాణిస్తున్నాడు. ఇది భారత్‌కు శుభపరిణామం అని జయసూర్య అన్నాడు. కాగా, ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ సెలెక్షన్ బోర్డు చైర్మన్‌గా ఉన్న జయసూర్య , కుమార సంగకర, మహేలా జయవర్దన, తిలకరత్నె దిల్షాన్‌లు రిటైరయిన తర్వాత శ్రీలంక జట్టు క్లిష్టకాలాన్ని ఎదుర్కొంటోందన్న విషయాన్ని అంగీకరించాడు. అలాంటి ఆటగాళ్ల స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమని ఆయన అన్నాడు. వాళ్లంతా 15-16 ఏళ్ల అనుభవం ఉన్న ఆటగాళ్లని అన్నాడు. సెలెక్టర్ల చైర్మన్‌గా తనను నియమించినప్పుడు అదో పెద్ద బాధ్యత అని, అయినప్పటికీ తాను రిస్క్ తీసుకున్నానని, ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో శ్రీలంక జట్టు 3-0 తేడాతో విజయం సాధించిందన్నాడు.

చిత్రం..‘ఎ టాల్ ఆర్డర్’ పుస్తక ప్రచార కార్యక్రమంలో జయసూర్య