క్రీడాభూమి

గియానీ ఆసీస్ పర్యటన వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, డిసెంబర్ 2: కొలంబియా విమాన ప్రమాదంలో మృతి చెందిన బ్రెజిల్ సాకర్ క్రీడాకారుల అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వీలుగా అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో తన ఆస్ట్రేలియా పర్యటనను వాయిదా వేసుకున్నాడు. సోమవారం ఉదయం జరిగే మహిళల అండర్-20 ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ను తిలకించేందుకు అతను రావాల్సి ఉండింది. అయితే, ఇటీవల కొలంబియా విమాన ప్రమాదంలో మరణించిన 19 మంది క్రీడాకారుల మృతితో దిగ్భ్రాంతికి గురైన అతను పలు పర్యటనలను మానుకున్నాడు. వాటిలో భాగంగానే ఆస్ట్రేలియా టూర్‌ను కూడా వాయిదా వేసుకున్నాడు. స్వదేశానికి చేరిన మృత దేహాలకు అంత్యక్రియలు సోమవారం జరగనుండగా గియానీ హాజరవుతాడని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఫిఫా తెలిపింది.