క్రీడాభూమి

భారత్ చేతిలో నేపాల్ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, డిసెంబర్ 2: మహిళల ఆసియా కప్ టి-20 టోర్నమెంట్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ను ఢీకొన్న నేపాల్ చిత్తుచిత్తుగా ఓడింది. మహిళల క్రికెట్ టి-20 ఫార్మెట్‌లో అత్యల్ప స్కోరును నమోదు చేసి పరువు పోగొట్టుకుంది. 121 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆ జట్టు 16.3 ఓవర్లు ఆడి, కేవలం 21 పరుగులకే కుప్పకూలింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 120 పరుగులు సాధించింది. శిఖా పాండే అజేయంగా 39 పరుగులు చేయగా, నేపాల్ బౌలర్ రుబినా చెత్రి 21 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ ఏ దశలోనూ భారత్‌ను ప్రతిఘటించలేకపోయింది. సరితా మాగర్ ఆరు పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిందంటే, ఆ జట్టు పతనం ఏవిధంగా కొనసాగిందో ఊహించుకోవచ్చు. భారత బౌలర్ పూనమ్ యాదవ్ తొమ్మిది పరుగులకే మూడు వికెట్లు కూల్చింది.

చిత్రం..నేపాల్‌ను చిత్తు చేసిన భారత మహిళల క్రికెట్ జట్టు