క్రీడాభూమి

అబ్దుల్ రహమాన్, కైట్లిన్‌లకు ఎఎఫ్‌సి అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబూదబీ, డిసెంబర్ 2: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యువ ఆటగాడు ఒమర్ అబ్దుల్ రహమాన్, ఆస్ట్రేలియాకు చెందిన కైట్లిన్ ఫోర్డ్‌లకు ఆసియా ఫుట్‌బాల్ కానె్ఫడరేషన్ (ఎఎఫ్‌సి) బెస్ట్ ప్లేయర్ అవార్డులు దక్కాయి. ఇక్కడి ఎమిరేట్స్ ప్యాలెస్ హోటల్‌లో అట్టహాసంగా జరిగిన ఒక కార్యక్రమంలో అధికారులు వీరికి అవార్డులను ప్రదానం చేశారు. నిరుడు కూడా అబ్దుల్ రహమాన్ పేరు ఎఎఫ్‌సి ఉత్తమ క్రీడాకారుడి అవార్డుకు నామినేట్ అయింది. అయితే, ఎమిరేట్స్‌కే చెందిన అహ్మద్ ఖలీల్‌ను అవార్డు వరించింది. నిరుడు అవార్డు రానందుకు నిరాశ చెందినప్పటికీ, ఇప్పుడు దానిని దక్కించుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నానని అబ్దుల్ రహమాన్ అన్నాడు.
కైట్లిన్ రికార్డు
ఎఎఫ్‌సి ఉత్తమ క్రీడాకారిణి అవార్డును స్వీకరించిన కైట్లిన్ రికార్డు సృష్టించింది. నిరుడు ఆమె ఎఎఫ్‌సి యంగ్ ప్లేయర్ అవార్డును స్వీకరించింది. ఈ ఏడాది ఉత్తమ ప్లేయర్‌గా అవార్డును తీసుకుంది. ఈ రెండు విభాగాల్లోనూ అవార్డులు పొందిన ఏకైక మహిళగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది.
సీనియర్ ఉపాధ్యక్షుడిగా ప్రఫుల్ పటేల్
ఎఎఫ్‌సి సీనియర్ ఉపాధ్యక్షుడిగా ప్రఫుల్ పటేల్‌ను నియమించారు. గతంలో భారత ఫుట్‌బాల్ సంఘానికి వివిధ హోదాల్లో సేవలు అందిస్తున్న అతను ప్రస్తుతం ఎఎఫ్‌సి ఆగ్నేయ ప్రాంతాధికారిగా సేవలు అందిస్తున్నాడు. అతని ప్రతిభకు గుర్తింపుగా ఎఎఫ్‌సి అతనికి సీనియర్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలను అప్పచెప్పింది.

చిత్రం..బెస్ట్ ప్లేయర్ అవార్డులతో ఒమర్ అబ్దుల్ రహమాన్, కైట్లిన్ ఫోర్డ్