క్రీడాభూమి

జూ. జట్టుపై అనర్హత అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, డిసెంబర్ 3: జూనియర్ ప్రపంచ కప్ హాకీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనకుండా తమ జూనియర్ హాకీ జట్టుపై అనర్హత వేటు వేయడం అన్యాయమని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) నిర్ణయాన్ని పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పిహెచ్‌ఎఫ్) తప్పుపట్టింది. దీనిని ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. లక్నోలో డిసెంబర్ 8 నుంచి 18 వరకు జరిగే జూనియర్ ప్రపంచ కప్ పోటీల్లో పాక్ జట్టు ఆడడం అనుమానంగానే కనిపించింది. భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడమే ఇందుకు కారణం. పాక్‌తో ద్వైపాక్షిక క్రీడా సంబంధాలను భారత్ దాదాపుగా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో, లక్నోలో జరిగే టోర్నీకి జట్టును పంపేందుకు పాక్ సర్కారు అనుమతిస్తుందా అన్న అనుమానాలు తలెత్తాయి. అయితే, పిహెచ్‌ఎఫ్ పదేపదే విజ్ఞప్తి చేసిన తర్వాత లక్నోకు జట్టును పంపేందుకు నవాజ్ షరీఫ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, జట్టులోని ఆటగాళ్లకు వీసా జారీ కావడంలో జాప్యం జరుగుతున్నది. ఇలావుంటే, నిర్ణీత సమయంలో వీసాలను సమర్పించకపోవడంతో పాక్ జూనియర్ హాకీ జట్టుపై ఎఫ్‌ఐహెచ్ అనర్హత వేటు వేసింది. నిబంధనల ప్రకారం సకాలంలో అన్ని లాంఛనాలను పూర్తి చేయాలని, అలా చేయకపోతే, అనర్హత తప్పదని స్పష్టం చేసింది. 16 జట్లు పోటీపడే ఈ టోర్నీలో పాకిస్తాన్ స్థానంలో మలేసియా బరిలోకి దిగుతుందని వివరించింది. కాగా, ఎఫ్‌ఐహెచ్ తీసుకున్న నిర్ణయంపై పిహెచ్‌ఎఫ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. వీసా కోసం అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈలోపే అనర్హత వేటు వేయడం సమంజసం కాదని పేర్కొంది.
భారత కెప్టెన్‌గా హర్జీత్
లక్నో: ప్రపంచ కప్ జూనియర్ హాకీ చాంపియన్‌షిప్‌లో పోటీపడే 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు హర్జీత్ సింగ్ నాయకత్వం వహిస్తాడు. పంజాబ్‌లోని కురాలీకి చెందిన ఈ 20 ఏళ్ల మిడ్‌ఫీల్డర్ ఇటీవల కాలంలో భారత యువ జట్టు అనేక విజయాలను సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. గత నెల స్పెయిన్‌లో జరిగిన నాలుగు దేశాల టోర్నమెంట్‌లో భారత జట్టు అతని నాయకత్వంలోనే టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్‌లో జర్మనీపై సంచలన విజయాన్ని నమోదు చేసి, భవిష్యత్తు తమదేనని చాటిచెప్పింది. ఈ ఏడాది ఆరంభంలో హర్జీత్‌కు జుగ్రాజ్ సింగ్ వర్ధమాన క్రీడాకారుడి అవార్డు లభించింది. లండన్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన సర్దార్ సింగ్ నేతృత్వంలోని భారత సీనియర్స్ జట్టులో అతనికి స్థానం లభించింది. కాగా, ప్రపంచ కప్‌లో హర్జీత్‌కు డిప్యూటీగా డిఫెండర్ డిస్పాన్ టిర్కీ సేవలు అందిస్తాడు. 18 ఏళ్ల డిస్పాన్ యూరో ఆసియా కప్, ఇంగ్లాండ్ టూర్‌లలో పాల్గొన్నాడు.

చిత్రం.. హర్జీత్ సింగ్