క్రీడాభూమి

సిరీస్ విజయమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 7: ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన మొదటి క్రికెట్ టెస్టులో కొంత తడబడి, డ్రాతో బయటపడినా, ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థిని చిత్తుచేసిన టీమిండియా గురువారం నుంచి ఇక్కడ మొదలుకానున్న నాలుగో టెస్టుపై కనే్నసింది. ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ టెస్టును గెలిచినా, కనీసం డ్రా చేసుకున్నా సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. అయితే, విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు అద్వితీయ ఫామ్‌ను కొనసాగిస్తూ, మరో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది. ఇదే స్టేడియంలో, ఇంగ్లాండ్‌తో ఆడిన చివరి మ్యాచ్‌ని 2012లో ఆడిన భారత్ దానిని 10 వికెట్ల తేడాతో కోల్పోయింది. ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇప్పుడు కోహ్లీ బృందానికి లభించింది. అంతేగాక, వరుసగా మూడు సిరీస్‌లను తన ఖాతాలో వేసుకున్న ఇంగ్లాండ్ దూకుడుకు కళ్లెం వేసి, ఈసారి తన ఆధిపత్యం ముద్ర వేయడానికి కూడా భారత్‌కు ఇదే మంచి అవకాశం. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక టెస్టు డ్రాకాగా, మిగతా రెండు మ్యాచ్‌ల్లో విజయాలను సాధించిన భారత్‌కు సిరీస్ కోల్పోయే ప్రమాదం లేదు. ఈ టెస్టును కనీసం డ్రా చేసుకున్నా సిరీస్‌ను దక్కించుకుంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడితే, చివరిదైన చెన్నై టెస్టును గెల్చుకున్నా లేదా డ్రా చేసుకున్నా సిరీస్‌ను సాధిస్తుంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయాలను చవిచూసినా, సిరీస్ డ్రాకావడం తప్ప భారత్‌కు వచ్చే నష్టం ఏమీ లేదు. అయితే, కోహ్లీ బృందం మాత్రం వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్ భరతం పట్టాలని, గత పరాజయాలకు సరైన సమాధానం చెప్పాలని పట్టుదలతో ఉంది. గాయాల సమస్య భారత్‌ను వేధిస్తున్నప్పటికీ, ఇంగ్లాండ్‌ను కూడా అదే సమస్య వెంటాడుతున్నది. కాబట్టి, ఆ విషయంలో ఇరు జట్లు సమతూకంగా ఉన్నాయి. నిలకడా ఆడడంలో మాత్రం ప్రత్యర్థి కంటే కోహ్లీ సేనే మెరుగ్గా కనిపిస్తున్నది.
దూకుడుగా కోహ్లీ
ఇంగ్లాండ్ కెప్టెన్ అలస్టర్ కుక్ ఆచితూచి అడుగులేస్తుంటే, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం తనదైన శైలిలో దూకుడును కొనసాగిస్తున్నాడు. వ్యూహ రచనలోగానీ, ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలోగానీ అతను చూపుతున్న నేర్పు సీనియర్ క్రికెటర్లను కూడా అబ్బుర పరుస్తున్నది. కోచ్‌గా సేవలు అందిస్తున్న మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మద్దతు అతనికి సంపూర్ణంగా ఉంది. జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లే కావడంతో, కోహ్లీ తీసుకుంటున్న నిర్ణయాలకు సానుకూలంగా స్పందిస్తున్నారు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నుంచిగానీ, జాతీయ సెలక్షన్ కమిటీ నుంచిగానీ ఇప్పటి వరకూ కోహ్లీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. దీనితో తుది జట్టు కూర్పు నుంచి మైదానంలో తీసుకునే నిర్ణయాల వరకూ ప్రతి విషయంలోనూ కోహ్లీ తనదైన ముద్ర వేస్తున్నాడు. మొదటి టెస్టులో జట్టును ఓటమి నుంచి కాపాడిన అతని కెప్టెన్ ఇన్నింగ్స్ అందరినీ ఆకట్టుకుంది. అనంతరం రెండు టెస్టుల్లో జట్టును విజయపథంలో నడపడంలోనూ అతను కీలక పాత్ర పోషించాడు. ముంబయి టెస్టులోనూ జట్టును గెలిపించి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను భారత్‌కు అందించాలన్న పట్టుదల అతనిలో కనిపిస్తున్నది. పరిస్థితులు కూడా భారత్‌కే అనుకూలంగా ఉన్నాయి.
ఇరు వర్గాలు తుది జట్లను గురువారం ఉదయం ప్రకటిస్తాయి.

చిత్రం... ముంబయలో బుధవారం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న టీమిండియా క్రికెటర్లు