క్రీడాభూమి

ఆస్ట్రేలియా ఓపెన్‌కు టాప్ స్టార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, డిసెంబర్ 8: వచ్చేనెల జరిగే ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్టు టాప్ స్టార్లు ధ్రువీకరించారు. గర్భవతి కావడంతో వికోట్టరియా అజరెన్కా ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్‌కు రావడం లేదు. ఆమెను మినహాయిస్తే, సెరెనా విలియమ్స్, ఏంజెలిక్ కెర్బర్, రోజర్ ఫెదరర్, నొవాక్ జొకోవిచ్, ఆండీ ముర్రే, ఏంజెలిక్ కెర్బర్ వంటి సూపర్ స్టార్లు ఈ టోర్నీలో ఆడతారు. ఈసారి టోర్నీలో అటు పురుషులు, ఇటు మహిళల విభాగాల్లో టాప్ సీడింగ్స్ మారిపోవడం గమనార్హం. చాలాకాలం నంబర్ వన్ స్థానంలో కొనసాగిన జొకోవిచ్ ఈ ఏడాదిని రెండో స్థానంతో ముగించనుండగా, ఆండీ ముర్రే మొదటిసారి టాప్ సీడ్‌గా పోటీపడతాడు. అదే విధంగా మహిళల విభాగంలో సెరెనా విలియమ్స్ టాప్ ర్యాంక్‌ను కోల్పోగా, ఏంజెలిక్ కెర్బర్ ఆ స్థానంలో బరిలోకి దిగుతుంది. ఆరు పర్యాయాలు ఈ టైటిల్‌ను కైవసం చేసుకున్న సెరెనా ఈసారి గెలిస్తే, ఓపెన్ ఎరాలో అత్యధిక పర్యాయాలు విజేతగా నిలిచిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టిస్తుంది. అంతేగాక, 23 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లతో స్ట్ఫె గ్రాఫ్‌ను అధిగమిస్తుంది.