క్రీడాభూమి

అంపైర్ రీఫెల్ తలకు గాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఫీల్డ్ అంపైర్‌గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ పేసర్ పాల్ రీఫెల్ బ్యాటింగ్ చేయలేదు. కానీ, భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేసిన బంతి తలకు తగలడంతో కిందపడిపోయాడు. అనంతరం వైద్య చికిత్స కోసం అతను మైదానాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇంగ్లాండ్‌తో గురువారం మొదలైన నాలుగో టెస్టు మ్యాచ్ రెండో సెషన్ ఆట ప్రారంభంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. డీప్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న భువీ బంతిని ఫీల్డ్ చేసి, వికెట్‌కీపర్ పార్థీవ్ పటేల్‌కు అందించే ప్రయత్నం చేశాడు. అయితే, అతను విసిరిన బంతి లెగ్ అంపైరింగ్ చేస్తున్న రీఫెల్ తల వెనుక భాగంలో తగిలింది. దీనితో అతను కింద పడిపోగా, భారత ఫీల్డర్లలో చటేశ్వర్ పుజారా ముందుగా అక్కడి చేరుకొని, పరామర్శించాడు. గ్రౌండ్ స్ట్ఫా వచ్చి రీఫెల్‌ను తీసుకెళ్లగా, అతని స్థానంలో థర్డ్ అంమపైర్ మరియాస్ ఎరాస్మస్ ఫీల్డ్ అంపైరింగ్‌కు వచ్చాడు. ఐసిసి రిజర్వ్ అధికారి శంషుద్దీన్ థర్డ్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.
పెద్దదేమీ కాదు..
బంతి తలకు తగిలినప్పటికీ రీఫెల్‌కు పెద్ద గాయమేదీ కాలేదని సిటీ స్కానింగ్‌లో స్పష్టమైంది. అయితే, ముందు జాగ్రత్తగా అతనికి విశ్రాంతినిచ్చారు. మ్యాచ్ 49వ ఓవర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. కెరీర్‌లో మొట్టమొదటి టెస్టు మ్యాచ్ ఆడుతున్న కీటన్ జెన్నింగ్స్ బంతిని స్క్వేర్ లెగ్ వైపు మళ్లించాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న భువీ బంతిని అందుకొని స్ట్రయికింగ్ ఎండ్‌వైపు విసిరాడు. కానీ, అది బలమైన త్రో కాకపోవడంతో నేరుగా లెగ్ అంపైర్ రీఫెల్ తల వెనుక భాగంలో తగిలింది. అతను కిందపడిన విధానం చూస్తే, బలమైన గాయం తగిలి ఉండవచ్చన్న అనుమానం వ్యక్తమైంది. అయితే, భయపడాల్సింది ఏమీ లేదని జట్టు మేనేజ్‌మెంట్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రమా దం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
భారత్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఇలాంటి సంఘటన జరగడం ఈఏడాది ఇది రెండోసారి. ఆస్ట్రేలియాతో కాన్‌బెరాలోని మనూకా ఓవల్ మైదానంలో భారత్ నాలుగో వనే్డ ఆడింది. ఆ మ్యాచ్‌లో ఇశాంత్ శర్మ వేసిన బంతిని ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ బలంగా కొట్టాడు. అది నేరుగా బౌలింగ్ ఎండ్‌లో ఉన్న అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో దవడకు తగిలింది. గాయమైన అతను మైదానాన్ని విడిచివెళ్లగా, అతని స్థానంలో థర్డ్ అంపైర్ పాల్ విల్సన్ ఫీల్డ్ అంపైర్‌గా సేవలు అందించాడు.

చిత్రం..భువనేశ్వర్ కుమార్ విసిరిన బంతి తగిలి కిందపడిన ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్‌ను
పరామర్శిస్తున్న భారత ఆటగాడు చటేశ్వర్ పుజారా